ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

వినాశకరమైన గణాంకాల నిరాకరణ

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

జాతీయ గణాంక కమిషన్ (ఎన్.ఎస్.సి.) లో ఇండిపెండెంట్ సభ్యులిద్దరు రాజీనామా చేయడంతో ప్రభుత్వ సంస్థల స్వయంప్రతిపత్తిపై మళ్లీ చర్చ మొదలైంది. విశ్వసనీయమైన గణాంకాలను సేకరించడంతో పాటు ఆ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం 2006లో జాతీయ గణాంక కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్థ నుంచి రాజీనామా చేసిన వారు చెప్తున్నట్టుగా ఈ మౌలిక విషయానికి కట్టుబడి ఉండడం లేదు. నేషనల్ సాంపుల్ సర్వే (ఎన్.ఎస్.ఎస్.ఒ.) 2017-18 సంవత్సరాలకు చెందిన కార్మికులపై నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. ఎన్.ఎస్.ఎస్.ఒ. క్రమ పద్ధతి ప్రకారం ఈ సర్వే చేస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని ఎన్.ఎస్.సి. 2018 డిసెంబర్ లోనే ఆమోదించింది. ఎన్.ఎస్.సి. తో నీతీ ఆయోగ్ సంప్రదించడం లేదని, పట్టించుకోవడం లేదని కూడా ఎన్.ఎస్.సి. నుంచి రాజీనామా చేసిన ఇద్దరు సభ్యులు తెలియజేశారు.

ఎన్.ఎస్.సి. స్వయం ప్రతిపత్తిని, సమర్థ్యాన్ని నీతీ ఆయోగ్ విస్మరించడం ఇదే మొదటి సారి కాదు. స్థూల జాతీయ ఉత్పత్తిని అంచనా వేయడానికి ఆధారంగా తీసుకునే సంవత్సరాన్ని 2011-12 గా మార్చిన తర్వాత నీతీ ఆయోగ్, కేంద్ర గణాంక కార్యాలయం (సి.ఎస్.ఒ.) కొత్త గణాంకాలను 2018 నవంబర్ లో ఎన్.ఎస్.సి. ని పక్కన పెట్టి విడుదల చేశాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉప సంఘం సిఫార్సులను పక్కన పెట్టి మునుపటి ప్రభుత్వంలో కన్నా తమ ఏలుబడిలో మెరుగైన అభివృద్ధి సాధించామని చెప్పడానికి ఈ గణాంకాలు విడుదల చేశారు. ఈ లెక్కలకు ఎన్.ఎస్.సి. చూపిన లెక్కలకు పొంతన లేదు. నిపుణులు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. అధికారిక గణాంకాలను మార్చారని నీతీ ఆయోగ్ ను, సి.ఎస్.ఒ. ను నిపుణులు విమర్శించారు.

నివేదిక పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) అమలు తర్వాత ఉద్యోగకల్పనపై ఎన్.ఎస్.ఎస్.ఒ. సమగ్ర సర్వే చేసి విడుదల చేసిన సమాచారమైనందువల్ల ఈ గణాంకాలు విశ్వసనీయమైనవి. ఇవి ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించి తేల్చిన లెక్కలు గనక ప్రభుత్వం ఈ వివరాలను ఎందుకు తొక్కి పెట్టింది? ఉద్యోగ కల్పన పరిస్థితి అద్వానంగా ఉన్నట్టు ఈ లెక్కల్లో తేలినందువల్ల ఈ నివేదికను తొక్కి పెట్టారన్న భావన సర్వత్రా వ్యాపించి ఉంది. ప్రభుత్వం మాత్రం ఈ వాదనను ఆమోదించడం లేదు.

ఎన్.ఎస్.ఎస్.ఒ. నివేదికలోని అంశాలను కొన్ని మీడియా సంస్థలు బయట పెట్టాయి. ఈ వార్తల ప్రకారం దేశంలో ఉద్యోగ కల్పన దారుణంగా ఉంది. పత్రికలు ఎన్.ఎస్.ఎస్.ఒ. నివేదిక అంశాలను బయట పెట్టిన సమాచారం 2017-18లో ఉపాధి కల్పన కేవలం 6.1 శాతం ఉంది. కానీ ప్రస్తుత వారం నాటి పరిస్థితి ప్రకారం నిరుద్యోగ సమస్య 8.9 శాతం ఉంది. పట్టణ ప్రాంతాలలో ఎన్.ఎస్.ఎస్.ఒ. నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగం 9.6 శాతం ఉంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 7.8 శాతం ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ లెక్కల ప్రకారం నిరుద్యోగం 5.3 శాతం ఉంటే ఎన్.ఎస్.ఎస్.ఒ. అంచనా ప్రకారం 8.5 శాతం ఉంది. అలాగే 15 నుంచి 29 ఏళ్ల మధ్య గల యువతలో నిరుద్యోగం చాలా ఆందోళనకరంగా ఉంది. కాని కార్మికుల భాగస్వామ్యం 36.9 శాతం ఉంది. అంటే చాలా మంది పని మానుకోవలసి వస్తోంది. ఇలా పని మానుకునే వారిలో మహిళల సంఖ్య ఎక్కువ. అధిక నిరుద్యోగం కార్మిక భాగస్వామ్యం తగ్గడం పెరుగుతుందనుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు శుభ సూచకం కాదు. ఎందుకంటే మన దేశంలో యువత అధికంగా ఉంది.

సమాచారం అంతా ఇంకా ముసాయిదా స్థాయిలోనే ఉంది కనక పని మానుకునే వారి పరిస్థితిని తగ్గించి చూపాలని ఎన్.డి.ఎ. ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తాయి కనక ప్రభుత్వం ఇలాంటి వాదనలను ముందుకు తోస్తోంది. ఎన్.ఎస్.ఎస్.ఒ. నివేదిక ముసాయిదా స్థాయిలో ఉండవచ్చు. కాని ఆ నివేదిక అధికారికంగా విడుదలైనా నిరుద్యోగ రంగంలో సంక్షోభం లేదని చెప్పడానికి ఉపకరించకపోవచ్చు. ఈ సమాచారం ఆధారంగా ఎన్.డి.ఎ. ప్రభుత్వం తాము అనేక ఉపాధి అవకాశాలు కల్పించామని పార్లమెంటులోనూ, బయటా చేస్తున్న వాదనలను ప్రతిపక్షాలు తిప్పి కొట్టే అవకాశం ఉంది. 2014 ఎన్నికల సమయంలో ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్.డి.ఎ. ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని మరచి పోవడానికి వీలు లేదు. కానీ బయటకు వచ్చిన సమాచారం నిరుద్యోగ సమస్య ఎన్.డి.ఎ. హయాంలో గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని స్పష్టం అవుతోంది. ఈ గణాంకాలు బయట పెడితే తమ బండారం బట్ట బయలు అవుతుందని ఎన్.డి.ఎ. ప్రభుత్వానికి తెలుసు. ఎన్నికలు జరగవలసి ఉన్న సమయంలో ఇలాంటి వాస్తవిక సమాచారం ప్రభుత్వానికి వినాశకరంగా ఉంటుంది.

నిరుద్యోగంపై సమాచారం మెరుగైన రాజకీయాలకు, ఆర్థికాభివృద్ధి జరుగుతోందనుకుంటే ఈ పరిస్థితి ఎందుకు ఎదురవుతోందని ఆలోచించడానికి ఉపకరిస్తుంది. ఉద్యోగాలు లేని ఆర్థికాభివృద్ధి మాత్రమే సాధిస్తున్నామన్న అసలు విషయం బయట పడ్తుంది. నిజానికి ఇలాంటి సమాచారాన్ని అంగీకరిస్తే పాలక వర్గాలు విశాల ప్రజానీకానికి ప్రయోజనకరమైన విధానాల రూపకల్పనకు తోడ్పదాలి. ప్రభుత్వం ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకుని విధానాలకు మెరుగులు దిద్దాలి. అయినప్పటికీ నీతీ ఆయోగ్ గణాంక సంస్థ స్వయం ప్రతిపత్తిని ఖాతరు చేయకుండా అధికారిక గణాంకాల విశ్వసనీయతనే దెబ్బ తీస్తోంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top