ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

జి.ఎస్.టి. పరిహార సంక్షోభం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

పన్నులకు సంబంధించిన సంస్కరణలు చేపట్టినప్పుడు ఆదాయం ఎంత ఉంటుదోనన్న విషయంలో అనిశ్చితి ఉండడం ఏ ప్రభుత్వానికైనా ఆందోళనకరమైందే. అందుకే ఇలాంటి సంస్కరణలకు ప్రభుత్వ రాబడిపై కచ్చితమైన హామీ ఉండాలి. ఈ విషయంపై విస్తృతమైన ఏకాభిప్రాయం కుదరాలి. 2017 నాటి వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) చట్టం వచ్చినప్పుడు రాష్ట్రాల జి.ఎస్.టి.లో ఏదైనా లోటు ఉన్నా రాబడి తగ్గకుండా చూస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇ పరిహారం జి.ఎస్.టి. అమలులోకి వచ్చిన మొదటి అయిదేళ్లూ ఉంటుందన్నారు. తదునుగుణంగానే జి.ఎస్.టి. మండలి ఈ పన్ను విధానాన్ని, నిర్మాణ తీరును, పరిపాలనాపరమైన అంశాలు మొదలైనవాటిపై ప్రయోగాలు చేస్తూనే ఉంది. పన్ను చెల్లించేట్టు చూడడానికి, ఆర్థిక వ్యవస్థ మీద భారం పడకుండా చూడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక వైపున జి.ఎస్.టి. వసూళ్లు ఆశించినంతగా లేవు. జి.ఎస్.టి. పరిహారానికి, ఈ పరిహారం సెస్సు మధ్య అంతరం చాలా ఉంది. రాష్ట్రాల రాబడిలో ఉండే లోటును పూడ్చే విషయమై రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. అందువల్ల పరిహారం చెల్లింపు చట్టమే ప్రశ్నార్థకంగా మారింది.

2015-16లో పన్ను వసూళ్ల ఆధారంగా మొత్తం జి.ఎస్.టి. వసూళ్లలో 14 శాతం వృద్ధి ఉంటుందన్న అంచనాతో రాష్ట్రాల జి.ఎస్.టి. రాబడి అంచనా వేశారు. 2022 జూన్ దాకా రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పాన్ మసాలా, పొగాకు, పొగాకు ఉత్పత్తులపై, ఎరేటెడ్ నీరు, ప్రయాణికుల కార్లు మొదలైన వాటిపై జులై ఒకటి 2017 నుంచి జి.ఎస్.టి. పరిహార సెస్సు విధిస్తున్నారు. అయినా రాష్ట్రాలకు పరిహారం చెల్లించడంలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఉదాహరణకు 2019 జులైలో విడుదల చేసిన రూ. 17,789 కోట్లు 2019 ఏప్రిల్, మే నెలలకు సంబంధించింది. అలాగే 2019 జూన్, జులై నెలలకు సంబంధించిన రూ. 27,955 కోట్ల పరిహారాన్ని 2019 ఆగస్టులో విడుదల చేశారు.2019 డిసెంబర్ మధ్యలో విడుదల చేసే రూ. 35,298 కోట్ల పరిహారం 2019 ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించింది.

జి.ఎస్.టి. పరిహారం విడుదల చేయడంలో జాప్యం కొత్తేమీ కాదు. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిది: జి.ఎస్.టి. వసూళ్లు ఎస్.జి.ఎస్.టి. వసూళ్లలో లోటు కనిపించడం. దీనికి ప్రధాన కారణం దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం. జి.ఎస్.టి. వసూళ్లలో అనిశ్చితి కొనసాగుతోంది. స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.) వృద్ధి రేటు పెరిగితే తప్ప పరిహారం సమయానికి చెల్లించడం కుదరదు. అందువల్ల ఇక ముందు కూడా రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య వివాదాలు కొనసాగక తప్పదు. రెండవది: జి.ఎస్.టి. పరిహార చట్టంలో జి.ఎస్.టి.సి.సి. వసూళ్లలో లోటు ఉన్నప్పుడు రాష్ట్రాలకు పరిహారం చేల్లించడానికి మార్గదర్శకాలు ఏమీ లేవు. జి.ఎస్.టి. కుదుట పడే దాకా పరిహారం చెల్లించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంటుంది. మరో వేపు జి.ఎస్.టి.సి.సి.లో లోటు, పరిహారం చెల్లింపు విషయం సవాలుగా పరిణమించింది. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న కొద్దీ ఈ సమస్య పెరుగుతోంది.

బిహార్ మినహాయిస్తే చాలా రాష్ట్రాలు జి.ఎస్.టి. వసూళ్లలో 14 శాతం వృద్ధి సాధించలేకపోతున్నాయి. అందువల్ల లోటు భర్తీ చేయవలసిన అవసరం పెరుగుతోంది. ఈ కారణంగానే జి.ఎస్.టి. పరిహారాన్ని మరో మూడేళ్ల పాటు పెంచాలని రాష్ట్రాలు 15వ ఆర్థిక సంఘాన్ని కోరుతున్నాయి. అంటే 2024-25 దాకా పొడిగించవలసి వస్తుంది. లాంఛనప్రాయంగా పొడిగింపుపై నిర్ణయం తీసుకోవలసింది జి.ఎస్.టి. మండలి అయినా వాస్తవంగా నిర్ణయం తీసుకోవలసింది కేంద్ర ప్రభుత్వమే. అయితే ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నందువల్ల జి.ఎస్.టి.సి.సి.ని రద్దు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఒక వేళ పరిహార గడువును 2022 జూన్ ను మించి పొడిగించినా పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుందా అన్నది ప్రశ్నే. జి.ఎస్.టి. వసూళ్లు పెరిగితే తప్ప ఇది సాధ్యం కాదు.

అంటే ప్రస్తుత పరిస్థితిని చూస్తే భారత కోశ విధానం సంక్షోభంలో ఉందా? కచ్చితంగా ఇలాంటి నిర్ణయానికి రావడం తొందరపాటే కావచ్చు. జి.ఎస్.టి. వ్యవహారం కుదుటపడే దాకా ఏకపక్షంగా జి.ఎస్.టి. రాబడికి రక్షణను ఉపసంహరించడం కుదరకపోవచ్చు. అయితే జి.ఎస్.టి. పరిహారం నిరంతరం కొనసాగించడం సాధ్యం కాదని రాష్ట్రాలు కూడా గుర్తించాలి. అందువల్ల పరిహారం అందుతుందన్న ఆశతో ఖర్చు పెట్టడం మానుకోవాలి. రాష్ట్రాలు తమ పన్నులు, పన్నేతర రాబడి మార్గాలను పెంపిందింప చేసుకోవాలి. లేదా అనుత్పాదక ఖర్చులు తగ్గించుకోవాలి. అప్పుడే కోశ విధానాన్ని సంఘటితం చేయడం సాధ్యం అవుతుంది. ప్రతుత పరిస్థితి రాష్ట్రాలకు కోశ సంబంధమైన కుదుపులను ఎదుర్కోవడానికి ఉపకరించాలి. పరిహారాన్ని ఉపసంహరించినప్పుడు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top