ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

సంక్లిష్ట రాజకీయ స్థితి

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మహారాష్ట్రలో రాజకీయాలు తర్కబద్ధంగా ఆలోచిస్తే మూడు రాజకీయ పక్షాల చుట్టూ తిరుగుతున్నాయి. అవి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన. ఒక తర్కం ఈ మూడు పార్టీలు కలిసి తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచిస్తే మరో తర్కం ప్రకారం ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరవలసిందే అని చెప్తున్నాయి. తప్పని సరిగా అన్న మాట అవసరాన్ని సూచిస్తుండగా చేసి తీరవలసిందే అన్న మాట గత్యంతరం లేదు అని చెప్తోంది. ఇందులోనూ తప్పని సరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న మాటలో "రాజకీయ వంచన"కు అలవాటు పడిన పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలా అన్న మీమాస కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలను పీడిస్తోంది. అంటే శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదనే. ఇలా ఆలోచించినప్పుడు చర్చలకు, సంప్రదింపులకు అవకాశం లేనట్టు కనిపిస్తుంది. నైతిక ప్రమాణాల ఆధారంగా వాదించే రాజకీయ విశ్లేషకులు రాజకీయాలను "స్వచ్ఛమైన" దృష్టితో చూస్తారు. ఈ మూడు పార్టీలకూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అర్హత లేదని ఈ తరహా రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ఈ వాదన వెనక కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి "సెక్యులరిజం" పై అంత నిబద్ధత లేదు అన్న అభిప్రాయం ఉంది. ఇలాంటి అనుమానాస్పద స్థితిలోనే ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయి. మీడియా వార్తలనుబట్టి చూస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

అయితే ఈ పార్టీల మధ్య చర్చలు తాత్కాలికమైనవిగానే కనిపిస్తోంది. అయితే చర్చలకు తెర మాత్రం పడలేదు. ఈ చర్చలు నిగూఢంగానే జరుగుతున్నాయి. అయితే ఆచరణాత్మకంగా చూస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయక తప్పని స్థితి ఉంది అన్న అభిప్రాయం ఈ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ వైఖరిలో కొత సంధిగ్ధత కనిపిస్తోంది. అందుకే అవి "స్పష్టంగా" జాగ్రత్తగా, ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఈ "జాగ్రత్త", "ఆచి తూచి" వ్యవహరించడంలో చర్చల్లో "అసాధ్యం" అయింది ఏమీ లేదని భావిస్తున్నట్టుంది.

ఈ పార్టీలు శివసేన నుంచి కొన్ని నిర్దిష్టమైన హామీలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నాయి. అంటే హిందుత్వ విషయంలో శివసేన కొంత మెతక వైఖరి అనుసరించాలని ఆశిస్తున్నాయి. బహుళత్వం, మత సామరస్యంపై రాజీ లేదు అన్నది నిజమే అయినప్పటికీ తప్పనిసరి అయిన ప్రత్యేక పరిస్థితుల్లో ఈ అంశాన్ని "దారి గుర్తులున్న స్తంభం"గానే పరిగణించాలనుకుంటున్నాయి. ఈ సందర్భంలో ప్రకృతి విపత్తులనుంచి రైతులను కాపాడడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అగత్యం ఉంది కనక హిందుత్వ మీద స్వల్పంగా దృష్టి తగ్గించినా ఫరవాలేదని శివసేన భావిస్తున్నట్టుంది. అయితే శివసేన గట్టి విశ్వాసంతో, బాధ్యతాయుతంగా ముందడుగు వేస్తుందా? లేదా మునుపటి సంకుచిత వైఖరినే అనుసరిస్తుందా? సంకుచితమైంది ఎందుకంటే శివసేన గత చరిత్ర అలాంటిదే. ఆ పార్టీ వైఖరి తిరోగమన పూరితమైంది. అంతరువులతో కూడిన సామాజిక వ్యవస్థను శివసేన ఎన్నడూ వ్యతిరేకించలేదు. అయితే కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ విషయంలో కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తక మానవు. ఆ పార్టీలు భాద్యతాయుతమైన తమ విశ్వాసాల ఆధారంగా విధానాలు రూపొందించగలవా? ఈ పార్టీల నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టడం కష్టమే. నిబద్ధత ప్రకారం ఈ పార్టీలు వ్యవహరించాలంటే నిరంతరం సంవాదం కొనసాగిస్తూనే ఉండాలి. అప్పుడే ప్రమాదకరమైన అంశాలను దూరం పెట్టడాం వీలవుతుంది.

సంవాదాలతో కూదిన రాజకీయాలు బాధ్యతాయుతమైన నిబద్ధత అవసరం ఉంటుంది. ఈ రకమైన నిబద్ధతకు సాధారణంగా నిర్బంధం ఉండదు. ఆ పరిభాష అవసరం ఉండకూడదు. వివిధ రాజకీయ పార్టీల ప్రయోజనం కోసం ఆచరణాత్మకంగా వ్యవహరించి అధికారం పంచుకోవలసి వస్తుంది. బాధ్యతాయుతమైన నిబద్ధతలు అంతర్గత నైతికత మీద ఆధారపడ్డ సంవాదాలు అయి ఉంటాయి. ఇందులో అసలైన ప్రాధాన్యతలను నిర్ణయించవలసి ఉంటుంది. ఇందులో వాగండంబరానికి, డాంబికాలకు తావు ఉండకూడదు. సామాన్యుల దృష్టితో ఆలోచించాలి.

అయితే నిర్బంధం కాని నిబద్ధత ఉంటుందని కాదు. రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైన విశ్వాసాలు ప్రదర్శించాలనుకుంటాయి. ఈ నిబద్ధతవల్ల శాంతి, మత సామరస్యం, బహుశః సమాజంలో స్నేహభావం ఏర్పడవచ్చు. అదే సమయంలో ఆపదలో ఉన్న వారిని సత్వరం ఆదుకోవాల్సిన పరిస్థితీ ఉంటుంది. మహారాష్ట్రలో ఎన్నికల తరవాత అనిశ్చిత పరిస్థితి తలెత్తినందువల్ల బాధ్యతాయుతమైన నిబద్ధత అవసరం ఉంటుంది. ఇది నైతిక నిబద్ధతకూ దారి చూపవచ్చు. తద్వారా మత ప్రాతిపదిక మీద జన సమీకరణను నివారించవచ్చు. మతపరమైన చిహ్నాల చుట్టూ జన సమీకరణకు పాల్పడకుండా ఉండవచ్చు. నిబద్ధమైన విశ్వాసాల మీద ఆధారపడ్డ బాధ్యతాయుతమైన ప్రవర్తను ఒక సారి సాధించి వదిలేసే వ్యవహారం కాదు. మత సామరస్యాన్ని వదిలేయనవసరం లేదు. నిరంతర చర్చలు, సంప్రదింపుల ద్వారా దీన్ని సాధించవలసి ఉంటుంది. ఇది కేవలం పార్టీ కార్యకర్తలకే పరిమితం కానవసరం లేదు. సామాన్య ప్రజలతో ఈ సంవాదం కొనసాగించాలి.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Back to Top