ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఉన్న మాటంటే ఉలుకు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ప్రజా జీవనంలో "అవమానం" అన్న మాట నిష్కర్షగా కాక పోయినా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాటను ప్రభుత్వ వ్యవస్థల విషయంలో వాడుతుంటారు. దాని వెనక ఉన్న వ్యక్తులు నేపథ్యంలోనే ఉంటారు. ఝార్ఖండ్ లో ఇటీవల మూక దాడిలో ఒక వ్యక్తిని కొట్టి చంపినప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం ఏ పాపం ఎరుగదని అయితే ఆ సంఘటన నైతికంగా భాధాకరమైందని, ఆ ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాలి. అసలు ప్రభుత్వ వ్యవస్థలను అవమానించవచ్చా? ఒక వేళ అవమానించగలిగినట్టయితే ప్రభుత్వ వ్యవ్స్థలను అవమానించినప్పుడు నైతికత ఉంటుందా?

నిజానికి ప్రభుత్వ వ్యవస్థలకు సున్నితత్వం ఉండదు. అందువల్ల అవమానంగా భావించే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలు కేవలం భౌతికమైనవే. అలాగే ప్రభుత్వ వ్యవస్థలను వ్యక్తులు దూషించవచ్చు కానీ మనుషుల్లాగా వాటికి అవమాన భారం ఉండదు. అయితే ఈ వ్యవస్థలు అనుసరించే ప్రక్రియలు అవమానకరంగా ఉండవచ్చు. వీటిని ఎవరు నిర్వహిస్తున్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థలు ప్రజలతో సంబంధం ఉన్నవి కనక ఇవి నైరూప్యంగానే ఉంటాయి. ఎందుకంటే అవి ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినవి కావు. అందువల్ల వ్యవస్థలు, సంస్థలకు అవమానం ఉండదు. అలాంటప్పుడు "ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారు" అని ఎలా అనగలం?

ప్రభుత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్య నియమాలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తిలో నిబిడీకృతమైనాయనుకున్నప్పుడే అవమానం అన్న ప్రశ్న తలెత్తుతుంది. లేదా అవి ఒక వ్యక్తికి, లేదా కొందరు వ్యక్తులకు పరిమితం అయిపోయి ఉండాలి. అప్పుడే వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల అవమానం ఆ వ్యవస్థలకు కూడా అంటుకుంటుంది. వ్యవస్థలు ఈ వ్యక్తులకు ప్రతి రూపాలుగా తయారై వారు నైతికత గురించి మాట్లాడుతుంటారు.

అందువల్ల ప్రభుత్వ వ్యవస్థలను అవమానిస్తున్నారు అని వాదించడం నిజం కాదు. అలా అవమానంగా భావించడానికి నికరమైన కారణాలు ఉండాలి. మరో రకంగా చెప్పాలంటే సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని నిందిస్తే అవమానంగా భావించవచ్చి. అప్పుడు అది అపనింద అవుతుంది. అనుచితమైన ఆరోపణలు ప్రభుత్వం చేసే మంచి పనిని పరిగణించవు. ఈ దృష్టితో అవమానం అంటే ఆ వ్యవస్థలను గౌరవించకపోవడం. ప్రజలకోసం మంచి పనులు చేస్తున్నామనుకునే ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో అవమానానికి గురైనట్టు భావిస్తుంది.

అందుచేత అవమానిస్తున్నారు అనడం నిరాధారమైంది కాకపోవచ్చు. అయితే ఆ మాట అనడానికి కచ్చితమైన ఆధారాలు ఉండాలి. న్యాయం దృష్టితో ఈ మాట చెప్పాలి. కచ్చితమైన ఆధారాలు లేనప్పుడు అవమానిస్తున్నారు అన్న ఆరోపణ "విలక్షణమైంది" అవుతుంది. న్యాయమైన విమర్శలు కాకుండా అన్యాయమైన ఆరోపణలు చేసినట్టు అవుతుంది. ప్రభుత్వం సరైన సమయానికి చర్య తీసుకుంటే అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారనడానికి సహేతుకమైన కారణం ఉంటుంది. అంటే ఈ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వానికి ఆ అవకాశం ఉంటుంది. పన్నులు ఎగవేసే వారిని శిక్షించినప్పుడు, మూక దాడులకు పాల్పడే వారి మీద చర్య తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఇలా వాదించడానికి అవకాశం ఉంటుంది. మూక దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు సమయానికి తగిన చర్య తీసుకుని దోషులను శిక్షిస్తే ఆ వ్యవస్థపై గౌరవం పెరుగుతుంది. ఉదారవాద వ్యవస్థలో ప్రజల విశ్వాసం సంపాదించాలంటే ఇది అవసరం. ప్రభుత్వాలు దోషులను శిక్షించినప్పుడు తమను అనవసరంగా విమర్శిస్తున్నారని వాదించే వీలుంటుంది. ఇలాంటి పరిస్థితులు అనేక రాష్ట్రాలలో కనిపించవు. జార్ఖండ్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం సమయానికి తగిన చర్య తీసుకోనప్పుడు అవమానించారు అని వాదించడం కుదరదు. అలాంటి సందర్భాలలో నిర్ణయాలు తీసుకునే వారు తప్పుకోవాలి.

అలా తప్పుకోవడం అంటే ఆత్మ పరిశీలన చేసుకోవడం. ఈ పని ప్రభుత్వాలు నిరంతరం చేయాలి. తప్పుకోవడం అంటే రాజ్యాంగ నియమాలనుంచి తప్పుకోవడం కాదు. రాజ్యాంగ నియమాల ప్రకారం ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రభుత్వాలు ఆంత్మ పరిశీలన చేసుకుంటే తన పని తీరును మెరుగు పరచుకోవచ్చు. మెరుగైన పరిపాలన అందించవచ్చు. అప్పుడు సహజంగానే ప్రతిపక్షాలు విమర్శలు సంధించే అవకాశం ఉండదు. ఆత్మ పరిశీలన చేసుకుని, తమ పని తీరును బేరీజు వేసుకుంటే ప్రతిపక్షాలు చేసే విమర్శలను అవమానంగా భావించే అవసరం ఉండదు. లేకపోతే ఉన్న మాటంటే ఉలిక్కి పడినట్టే ఉంటుంది. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top