ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఎన్నికల రాజకీయాలు స్వచ్ఛమైనవేనా?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

గతంలో నిర్మాణాత్మక రాజకీయాలలో పీడిత ప్రజలు అనునిత్యం పోరాటాలు చేసే వారు. ఇప్పుడు అది గణనీయంగా తగ్గింది. ఇప్పుడు ఎన్నికల రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

ఎన్నికల రాజకీయాలు కొత్త మలుపు తిరిగిన మాట వాస్తవం. దుర్బల వర్గాలకు నాయకత్వం వహించే వారు సైతం అధికార రాజకీయాలలో భాగస్వాములు కావాలనుకుంటున్నారు. ఆదర్శానికి కట్టుబడి ఉండడం తగ్గిపోయింది. అందుకే రాజకీయం అంటే "సాధ్యమయ్యే రాజకీయం"గా మారిపోయింది. మలుపు తిరిగిన ఈ రాజకీయాలను విమర్శనాత్మకంగా తరచి చూసి ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇలాంటి రాజకీయాలు జీవన పరిస్థితులను సాధించేవిగా ఉండాలి. విశ్వ వ్యాప్తంగా ఈ రాజకీయాలు మనిషిని ఆలోచించే జీవిగా పరిగణిస్తాయి. గౌరవప్రదమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తాయి. ఇక్కడ లేవనెత్తే మౌలిక సమస్య ఏమిటంటే ఎన్నికల రాజకీయాలు నైతికంగా కనీస జీవనానికి అవకాశమిచ్చే సమాజానికి అవకాశం ఉందా అన్నదే.

వాస్తవిక అంశాలను విశ్లేషించి నైతికంగా కనీస జీవనం సాధించడానికి ఉన్న లోపాలను పరిశీలిద్దాం. వాస్తవిక రాజకీయాలను సవిమర్శకంగా చూడాలంటే వాటిని ఆదర్శపూరితమైన రాజకీయాలకు అతీతంగా పరిశీలించాల్సిందే. మరో రకంగా చెప్పాలంటే స్వచ్ఛమైన ఆదర్శ పూరిత రాజకీయం అంటే అదులో నైతిక, బౌద్ధిక అంశాలు ఉండాలి. అవి తిమ్మిని బమ్మిని చేసే రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అంటే స్వచ్ఛమైన రాజకీయాలు అంటే వాస్తవిక రాజకీయాలను సవిమర్శకంగా చూడడమే.

వ్యూహాత్మకంగా రాజకీయాలలో ప్రధానమైంది ఏమిటంటే సామాజిక, సాంస్కృతిక, భౌతిక అంశాలను పెంపొందింప చేసి, రెండో వేపున ఇందులో లొసుగులు, లోపాలు లేకుండా చూడడమే. అధికార పార్టీకి సంఖ్యా బలం ఉన్నందువల్ల ఎన్నికల గణాంకాల దృష్ట్యా అంతగా అనుకూలం కాని వారికి కూడా అవకాశం ఇవ్వడానికి వీలుంది. అలాంటి వారు సామాజికంగా అధికార పార్టీకి అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చే పక్షంగా చూపడానికి తోడ్పడతారు. మరో రకంగా చెప్పాలంటే అధికారం కోసం వెంపర్లాడే వారికి పేదలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు శాశ్వతంగా అననుకూలంగా ఉంటాయి.  

అలాంటి పార్టీలలో చేరాలంటే అభ్యున్నతికి కట్టుబడే లక్ష్యం ఉన్న వారై ఉండాలి. ఈ నమ్మకం వల్లే ప్రముఖ దళిత నాయకులు 1936లో అంబేడ్కర్ నెలకొల్పిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీలో చేరారు. అయితే నేటి దళిత పార్టీలలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీలో ఉన్న సారం ఉందా అని ప్రశ్నించవచ్చు.

శక్తిమంతమైన అధికార పార్టీలు ఇలాంటి వారిని కూడా తమలో ఇముడ్చుకుంటాయి. ఇతర పార్టీలు తమను నిర్లక్ష్యం చేశాయని వాదించే వారికి తమ పార్టీలో స్థానం కల్పిస్తాయి. అది అందరికీ స్థానం కల్పించే పార్టీ అని చెప్పుకోవడానికి కూడా వీలుంటుంది. అలాంటి పార్టీలు స్వచ్ఛమైన రాజకీయాలను అనుసరించగలగుతాయా? స్వచ్ఛమైన రాజకీయాలకు అవకాశం ఉంటుందా?

కొంత మంది సానుకూల రాజకీయాలు అని చేస్తున్న వాదనలను పరిశీలిద్దాం. దళితుల కోసం ప్రత్యేకించిన నియోజక వర్గాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం కుల రాజకీయాలకు అంతం అని వింగడించే రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. ఇలాంటి ధోరణులు ఎన్నికల రాజకీయాలలో సానుకూల అంశాలున్నాయని సూచిస్తాయి. నిజానికి ఇది “న్యాయం” అన్న భావనను తగ్గించి చూపడమే. బీజేపీ సామాజిక న్యాయానికి అంత విలువ ఇచ్చేదే అయి ఉంటే రిజర్వు కాని నియోజక వర్గాల నుంచి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల వారిని పోటీ చేయించి గెలిపించి చూపాల్సింది. అప్పుడే అది కుల చైతన్యాన్ని నిరాకరించడానికి వీలుండేది. బీజేపీ సమాజంలో పాతుకు పోయిందని చెప్పడానికి వీలుండేది. మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కూడా ఇదే సూత్రం వర్తించేది.

రిజర్వూ అయిన నియోజక వర్గాలలో ఎస్.సి.లు, ఎస్.టి.లు ఎక్కువ సంఖ్యలో గెలవడం వారి ఆత్మ గౌరవానికి చిహ్నం కావచ్చు. తమ సామాజిక వర్గంలో తాము ఉన్నతులమని చెప్పుకోవడానికి ఉపయోగపడవచ్చు. కానీ స్వచ్ఛమైన రాజకీయాలు అన్న ఆదర్శం అంటే ప్రజా ప్రతినిధులు తమ ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవడంతో పాటు తాము గౌరవ ప్రదంగా తలెత్తుకుని నిలబడగలగాలి.

ఈ అసమానతలు ఎస్.సి., ఎస్.టి. సభ్యులనే కాక ఇతర చట్ట సభల సభ్యులను కూడా నిరుత్సాహ పరుస్తాయి. ఈ వర్గాలలో నాయకులైన వారు, అణగారిన వర్గాలకు ప్రతినిధులం అనుకునే వారు తమ సత్తా ప్రదర్శించడం కష్ట సాధ్యం అవుతుంది. రాజకీయ పార్టీ చట్రాలలో అంతర్వులు ఉన్నందువల్ల ఒక నాయకుడు పైకి ఎదగడానికి అవకాశం ఉండవచ్చు. కానీ నైతికంగా సమానుడిని అని చెప్పుకోవడానికి వీలుండదు. మరీ ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలలో ఈ అసమాన సంబంధం ఈ ప్రతినిధులను స్వచ్ఛమైన రాజకీయాలనుంచి, నైతిక రాజకీయాలనుంచి దూరం చేస్తుంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top