ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ప్రతిపక్షాలు నమ్మకం చూరగొనగలవా?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఎన్నికల సందర్భంలో కూటములు ఏర్పాటు చేసే రాజకీయాలు రెండు నిర్మాణాత్మక అంశాలపై ఆధారపడి ఉంటాయి. మొదటిది ఎన్నికల రాజకీయాలలో ఒకే రాజకీయ పార్టీ ఆధిపత్యం కొనసాగుతున్నప్పుడు కూటమి కట్టవలసిన అగత్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంపూర్ణ ఆధిక్యత సాధించింది. ఈ సారి ఈ ఆధిపత్యం ప్రాంతాల రీత్యా విస్తరించకపోయినప్పటికీ బీజేపీ సంఖ్యాబలం సాధించింది. బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలలో అఖండ విజయం సాధించి, ఈశాన్య రాష్ట్రాలలో సత్తా చాటుకుంది. చిన్న పార్టీలు తమంత తాము ఎక్కువ స్థానాలు సాధించలేనప్పుడు కూటమి ఏర్పాటు చేయడం అవసరం అవుతుంది. ఎన్నికల విజయాలు సాధించడంలో ప్రతిపక్షం బలహీనంగా తయారైనప్పుడు, వాటి ప్రయోజనాలు, సామాజిక పునాది బలహీనంగా ఉన్నప్పుడు సంఘీభావం, పరస్పర విశ్వాసం ఆవశ్యకం అవుతుంది. ఆ పార్టీలను సమర్థించే వారి మధ్య సంఘీభావం తప్పనిసరి అవుతుంది. ఆ పార్టీల దృష్ట్యా కాకపోయినా రాజకీయ ప్రయోజనం కోసం, దుర్బల సమూహాల మధ్య ఐక్యత అవసరం అవుతుంది. దుర్బల సమూహాలు ప్రతిపక్షాల వేపు మొగ్గు చూపాయని, వాటికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ.) మీద విశ్వాసం లేదని అధికార పార్టీకి చెందిన అగ్ర నాయకులే పరోక్షంగా అంగీకరించారు. అందుకే దుర్బల సమూహాలు కూటములు ఏర్పాటు చేసే పార్టీల మీద విశ్వాసం వ్యక్తం చేస్తాయి. అయితే ఈ నమ్మకం సాకారం కావాలంటే వివిధ పార్టీల ఓట్లు కూటమిలోని ఇతర పక్షాలకు బదిలీ కావాలి. ఉమ్మడి లక్ష్య సాధనకు దాపరికం లేకుండా ఉండాలి. అయితే ఈ పార్టీలు దుర్బల సమూహాలకు చెందిన ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టగలవా? ఎన్నికలు ముగిసిన తరవాతి పరిస్థితినిబట్టి చూస్తే ఈ విశ్వాసంపై అనుమానాలు, వైఫల్యాలు, అనిశ్చితి, ఆందోళన బాహాటంగా కనిపిస్తున్నాయి. ఓటర్లు ఈ రాజకీయ పక్షాల మీద పెట్టుకున్న నమ్మకం ఎన్నికల ఫలితాలనుబట్టి చూస్తే విఫలమైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విశ్వాసం లేనప్పుడు ఈ పక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయగలవన్న ఆశ ఎటూ ఉండదు. అంటే ఓటర్ల నమ్మకం వమ్ము అయినట్టే. ప్రజలలో ఈ విశ్వాసం సన్నగిల్లినందువల్లే ఓటర్లు ఇతర పక్షాలకు ఓటు వేస్తారు. ప్రజలకు ఈ పార్టీల మీద నమ్మకం లేనందువల్ల ఇలా జరుగుతుంది.

అలాగే మెజారిటీ పార్టీ మీద నమ్మకం పెట్టుకున్న ఓటర్లు ఆ పార్టీ విఫలమైతే ఆ పార్టీ మీద విశ్వాసం ఉండదు. అలాంటప్పుడు నమ్మకం సడలి పోతుంది. ఈ స్థితిలో హేతుబద్ధమైన కారణాలకన్నా విశ్వాసం ప్రధానం అవుతుంది. ఇందులో ఓటర్ల స్వప్రయోజనాలు ముఖ్యం కావచ్చు. అందుకే చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోని పార్టీలకు అనుకూలంగా మళ్లీ ఓటు వేస్తారు. నిజానికి వాగ్దానాలను నెరవేర్చని, ఆ పార్టీ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడ్దవారు ఆ పార్టీకి ఓటర్లు వేసి ఉండకూడదు. కానీ ఇటీవలి ఎన్నికలలో ప్రస్తుత ప్రభుత్వంవల్ల నష్టపోయిన రైతులు, నిరుద్యోగులు కూడా అధికార పార్టీకి ఓటు వేశారు. నిజానికి ఈ వర్గాల వారు ప్రస్తుత ప్రభుత్వం కారణంగా ఇబ్బందులు పడ్డారు కనక ఆ పార్టీకి ఓటు వేసి ఉండకూడదు. ఓటర్లు ఒక పార్టీకి ఓటు వేసినప్పుడు ఓ నమ్మకంతో వేస్తారు. కానీ ఆ నమ్మకం నిలబడిందో లేదో చూడరు. ఎందుకంటే తాము తీసుకున్న నిర్ణయంలో మంచి చెడ్డలను వివేచించరు. ఓటరుకు విశ్వాసం ఉండాలి అంటే ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉన్న పక్షాన్ని ఎంపిక చేసుకోవాలి, ఆ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనుకోవాలి. ఇందులో ఓటరుకు స్వయం నిర్ణయాధికారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు ఓటర్ల నిర్ణయాన్ని నిందించకూడదు. ఎప్పుడూ వారే కష్ట నష్టాలు భరించాలని అనుకోకూడదు. మరి ప్రతిపక్ష పార్టీలు ఇలా పరిణాత్మకంగా ఆలోచించగలుగుతాయా? దుర్బల వర్గాల వారు నష్ట పోరు అన్న హామీ అధికార పార్టీలు ఇవ్వగలవా?

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top