ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ప్రతిపక్షాలను ఆవహించిన నిర్వేదం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సాధించిన విజయం అన్ని రకాలుగా మహత్తరమైందే. అయితే ఈ విజయాన్ని విపరీత దృష్టితో చూడవలసిన అవసరం లేదు. లోతైన విశ్లేషణ అవసరం. అయితే ఈ విశ్లేషణ హడావుడి వ్యవహారం కాకూడదు. అందరికీ భాగస్వామ్యం ఉండే ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉన్నవాళ్లు ఒక్క క్షణం ఆగి ఎన్నికల ఫలితాలను పరిశీలించాలి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని అభిమానించే వారు ఈ విజయాన్ని చూసి గంగవెర్రులెత్తిపోతూ ఉంటే ప్రతిపక్షం పూర్తి నైరాశ్యంలో పడిపోయింది. ఎన్.డి.ఎ.కు ఉన్న సకలవిధ వనరులను దృష్టిలో ఉంచుకున్నప్పుడు ప్రతిపక్షాలను విపరీతమైన నిర్వేదం ఎందుకు ఆవహించిందో అర్థం అవుతుంది. ఎన్నికల తరవాత ప్రతిపక్షాల పాత్ర ప్రజాస్వామ్యంలో ఎంత అవసరమో కూడా ఆలోచించాలి.

ప్రతిపక్షాలను ఆవహించిన నిర్వేదం వివిధ రకాలుగా వ్యక్తమైంది. కొన్ని ప్రతిపక్షాలు ధర్మాగ్రహం ప్రదర్శించి విమర్శలు గుప్పిస్తే మరి కొన్ని ఇతరులను తప్పు పడుతున్నాయి. నెపం ఇతరుల మీద తోసేస్తున్నాయి. బీజేపీకి పట్టున్న చోట్ల ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నిస్సహాయంగా మిగిలిపోయింది. 2014తో పోలిస్తే ముఖాముఖి పోటీలో కాంగ్రెస్ చాలా చోట్ల చిత్తుగా ఓడిపోయింది. ఇటీవల మధ్య భారత్ లోని మూడు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలలో సాధించిన విజయాలను కాంగ్రెస్ ఏ మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. అలాగే కర్నాటక, మహారాష్ట్ర, అమేఠీలో కాంగ్రెస్ పూర్తిగా పట్టు కోల్పోయింది. ఈ ఓటమి ప్రజాస్వామ్యం మీద ఉండవలసిన విశ్వాసాన్ని వమ్ము చేసింది. ఈ రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రతిపక్షాల ఆనవాళ్లు కూడా లేకపోవడం మరీ ఆశ్చర్యకరం. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం, అందులో కాంగ్రెస్ పాత్ర మరీ ఘోరమైంది. ఉత్తరప్రదేశ్, బిహార్ లో ఉన్న సామాజిక పరిస్థుతులను వినియోగించుకుని ఉంటే ఫలితాలు సాధించడానికి అవకాశం ఉండేదేమో.

ఉత్తరాదిన బీజేపీ గాలి వీచిందని, అది దక్షిణాదిన అంతగా కనిపించలేదని వాదించడం కేవలం ఆత్మ వచనే. బీజేపీ కర్నాటకలో అఖండ విజయం సాధించడమే కాక బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలలో గణనీయమైన ఫలితాలు సాధించింది. దీనికి కారణం నిరంకుశ పక్షాన్ని ఎదుర్కోవడంలో కేవలం ప్రాంతీయత వ్యవస్థాపరంగా పని చేయలేదు.  బీజేపీయేతర పార్టీలకు ఎక్కువ ఓట్లు వచ్చాయని ఊరట పొందడం కూడా సరైన పద్ధతి కాదు. గత అయిదేళ్లుగా బీజేపీకి 31 శాతం మంది ఓటర్ల మద్దతు మాత్రమే లభించిందని ఎన్.డి.ఎ. ఏతర పార్టీలకు 69 శాతం ఓట్లు వచ్చాయని ఊదరగొట్టారు. ఎవరు ముందు గీత దాటితే వారే విజేతలు అన్న ప్రస్తుత ఎన్నికల విధానాన్ని విస్మరించి బీజేపీ తన పథకాన్ని ప్రచారం చేసిన తీరును చూడకపోవడమే అవుతుంది. ఇది కేవలం గణాంకాల మీద ఆధారపడి వేసే లెక్కలకే పరిమితం అవుతుంది. కానీ బీజేపీని ఎదుర్కోవడానికి ఉండవలసిన ప్రత్యామ్నాయ విధానానికి ఎంత మాత్రం దోహదం చేయదు. ఇది తమ వీపు మీద తామే కొరడా దెబ్బలు కొట్టుకోవడమే. పైగా ఇది ప్రజల అభీష్టాన్ని కాదనడమే. విపరీతమైన ఆత్మన్యూనతా భావంవల్ల బీజేపీకి అంత భారీగా ఎందుకు ఓటు చేశారో తెలుసుకునే అవకాశం ఉండదు. అనేక రాష్ట్రాలలో బీజేపీ 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించింది. ముఖ్యంగా మధ్య భారత్ లోని రాష్ట్రాలలో బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీలు సాధించింది. ఎన్నికల పద్ధతిని అనుసరించకుండానే అధికార పక్షంగా మనగలగడానికి, సంఘ్ పరివార్ సిద్ధాంతాన్ని సమర్థించడానికి బీజేపీ ప్రయత్నించిందన్న వాస్తవాన్ని విస్మరించినట్టవుతుంది. అంతమాత్రం చేత ప్రజలు సంఘ్ పరివార్ ఉచ్చులో చిక్కుకున్నారనీ కాదు. ఇలాంటి వాదన చేయడం అంటే రాజకీయ కార్యకలాపాల నుంచి విరమించుకోవడమే. సత్తువ లేని వాస్తవాన్ని గొప్పగా చిత్రించడమే. ఇలాంటి పని చేయడం అంటే ప్రతిపక్షాలు నిరాశతో భ్రమలో పడిపోవడమే. సత్యానికి అనుగుణంగా జనాన్ని సమీకరించే బృహత్ కార్యక్రమాన్ని విడనాడడమే. ప్రజలు ముందే రాజకీయ నిర్ణయాలు తీసుకోరు అన్న విషయాన్ని మరిచిపోకూడదు. వారిలో రాజకీయ నిర్ణయాలు క్రమంగా ఏర్పడతాయి. ఆ అభిప్రాయాలను కూడగట్టడమే రాజకీయం. కొత్త వారిని ఎన్నుకునే అవకాశం ఎల్ల వేళలా ఉండదు కనక ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయాన్ని మలచ గలగాలి. బీజేపీకి, ఎన్.డి.ఎ.కి ఓటు వేసిన వారి అభిప్రాయాన్ని కూడా మలచగలగాలి.

బీజేపీ సామాజిక స్వభావాన్ని, రాజకీయ పథకాన్ని దృష్టిలో ఉంచుకుంటే భారతీయ సమాజంలో దానికి చోటు ఉంది. అది సంఘటితంగా లేకపోవచ్చు. స్పష్టమైన ఆకారంలో లేకపోవచ్చు. బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కనక అవి ఉపయోగపడి ఉండవచ్చు. ప్రతిపక్షాలు గనక న్యాయబద్ధమైన, సామరస్య పూర్వకమైన వాదన వినిపించదలచుకుంటే దానికి తగిన రాజకీయ వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. ధర్మాగ్రహం, ఆత్మవంచన, తమ వీపు మీద తామే కొరడా దెబ్బలు కొట్టుకోవడం మానేస్తేనే ప్రతిలక్షాలు ఈ పని చేయగలవు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top