ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

నోటా మిగిల్చే శేష ప్రశ్నలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఎన్నికల మీద ఆధారపడిన ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు అత్యంత ప్రధానమైందని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఓటు తక్షణం ఎలాంటి ప్రభుత్వం ఏర్పడుతుందని నిర్ణయించడంతో పాటు ప్రజాస్వామ్య భవిష్యత్తు ఏమిటో కూడా తేలుస్తుంది. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ అపారమైంది. కానీ ఇటీవలి కాలంలో ఓటు హక్కు చర్చనీయాంశం అయింది. ఓటు చాలా విలువైంది కనక ఆ ఓట్లు ఎక్కడ తమ విజయావకాశాలను దెబ్బ తీస్తాయోనని అభ్యర్థులు ఓటర్లను బెదిరిస్తున్నారు.

మరో వేపున కొంతమంది రాజకీయ నాయకులు ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పడంతో పాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ద్వారా ఓటు వేసేటప్పుడు మరో అభ్యర్థికి ఓటు వేయకూడదని కూడా అంటున్నారు. పోటీలో ఉన్న ఏ అభ్యర్థి నచ్చకపోతే "నోటా" (పై అభ్యర్థుల్లో ఎవరూ కాదు) అని కూడా తమ ఓటు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. ఇది ఓటర్ల నైతికతకు సంబంధించిన విషయం. "నోటా" ను నైతిక నిరసనగా భావిస్తున్నారు. ఇది రంగంలో ఉన్న అభ్యర్థులు మెరుగైన వారు కాదు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడం కాకుండా ప్రతికూలంగా ఓటు వేయడం. అంటే ఎన్నికయ్యే అభ్యర్థి విషయంలో తన బాధ్యత లేదని చెప్తున్నట్టే.

ఈ వాదనకు వ్యతిరేకంగా మరో వాదన కూడా ఉంది. "నోటా" మీట నొక్కే ఓటరు తన హక్కుని తన నైతికతనుబట్టి వినియోగిస్తున్నాడన్న మాట. కానీ ఓటు హక్కుని ఇలా వినియోగించుకున్నందుకు ఆ ఓటరు తన నిర్ణయానికి బాధ్యత వహించగలడా? రంగంలో ఉన్న అభ్యర్థులు మెరుగైన వారో కాదో అన్న ఒక్క అంశం ఆధారంగానే ఓటరు "నోటా" మీట నొక్కాలా? ఓటర్లు రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి ఇది ఏ మేరకు తోడ్పడుతుంది.

ఓటు విలువను నిర్ణయించేది ఓటర్లు మాత్రమే కాదు. అభ్యర్థి కూడా దాని శక్తి ఎంతో నిర్ణయిస్తాడు. చాలా సందర్భాలలో వ్యభిచార వృత్తిలో ఉన్న వారిని, ఆదివాసులను, మైనారిటీలను తమకు ఓటు వేయాలని అడిగిన వారే లేరు. ఓటు వేయాలని కోరడంలో ఉన్న నైతికత కన్నా అడక్కుండా ఉండడంలో రాజకీయ ప్రయోజనం ఉందని అభ్య్రర్థులు భావిస్తూ ఉండవచ్చు. తమను ఓటు వేయమని ఎవరూ అడగకపోతే ఓటర్లు దాన్ని అవమానంగా కూడా భావిస్తారు. ఓటర్లకు ఓటు వేసే హక్కు ఉంది కాని తమను ఎవరైనా ఓటు వేయమని అడిగే హక్కు లేదు. తమకు ఓటు వేయాలన్న కాంక్ష ఎంత బలంగా ఉన్నప్పటికీ తమను ఓటు వేయమని ఎవరూ అడగకపోతే తమ ఓటుకు విలువ లేదేమోననీ భావిస్తారు. ఓటు వేయమని ఎవరైనా అడిగితే అలాంటి ఓటర్లు తమ ఓటుకు విలువ ఉందని భావించవచ్చు.

వయోజనులందరికీ ఓటు హక్కు ఉంటుంది. స్త్రీ-పురుష మత విభేదాలతో నిమిత్తం లేకుండా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది కనక తమ ఓటుకు విలువ ఉందని అనుకుంటారు.

నైతికత ఆధారంగా "నోటా"ను వినియోగించుకోవడం అన్ని సందర్భాలలోనూ సరైంది కాకపోవచ్చు. "నోటా"ను వినియోగించుకోవడానికి అభ్యర్థుల గుణం మాత్రమే కాకుండా సామాజిక కారణాలు కూడా ఉండవచ్చు. లేకపోతే రిజర్వు అయిన నియోజకవర్గాలలో "నోటా" ఓట్లు ఎక్కువగా ఎందుకు ఉంటున్నట్టు? ఆ నియోకవర్గం ఒక సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కేటాయించినందువల్ల చాలా మంది "నోటా" ను ఆశ్రయిస్తున్నారు. రిజర్వు నియోజకవర్గాలలో రాజకీయాలు అంత పోటా పోటీగా ఉండకపోవచ్చు. అందువల్ల ఎక్కువ మంది "నోటా" వినియోగించుకుంటూ ఉండవచ్చు. ప్రజా ప్రతినిధుల ప్రమాణాలు దిగజారుతున్నాయి కనక చాలా మంది "నోటా"ను ఆశ్రయిస్తున్నారు. ఈ నిర్ణయం కచ్చితంగా అభ్యర్థుల గుణగణాల మీద ఆధారపడి తీసుకుంటున్నారని చెప్పలేం. అభ్యర్థుల పని తీరును బట్టి నిర్ణయిస్తున్నారనీ చెప్పలేం. "నోటా" వ్యక్తిని సామూహిక బాధ్యత నుంచి విడదీస్తోంది. దుష్ట రాజకీయాలకు వ్యక్తులు తమ బాధ్యత ఏమీ లేదనుకుంటున్నారు.

"నోటా" కచ్చితంగా ఓటరు నిర్ణయానికి సంబంధించిన అంశం. అయితే ఇది ఒక అభ్యర్థికన్నా మెరుగైన అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఉపకరించడం లేదు. సామూహిక బాధ్యత గురించి పట్టించుకునేటట్టయితే "చెడు" అభ్యర్థులకు బదులు అంతకన్నా మెరుగైన అభ్యర్థులను ఎన్నికునే అవకాశం ఉండాలి. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top