ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

తటస్థ అధికారవర్గం అవసరమా?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

పదవీ విరమణ చేసిన 80 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖ అనేక కారణాల రీత్యా ప్రధానమైంది. మొట్టమొదటిది భారత రాజ్యాంగంలోని ప్రామాణిక సూత్రాల ఆధారంగా వీరు ఈ లేఖ రాశారు. అధికారవర్గం రాజ్యాంగానికి అనుగుణంగా నిబద్ధమై పని చేయవలసి ఉంటుంది. ఈ లేఖలో ప్రభుత్వ ఉన్నతాధికారులు రాజ్యాంగానికి మినహా రాజకీయ నాయకులకు, మరే వ్యవస్థకు బానిసలు కారు అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండవది-ఉన్నతాధికారులు తటస్థంగా ఉండాలన్న సూత్రం వారు స్వతంత్రంగా వ్యవహరించడానికి, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి , లేదా అవమానించే ఇతర సామాజిక వర్గాలకు లొంగి ఉండవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఈ లేఖలోని స్ఫూర్తినిబట్టి చూస్తే పొరపాట్లు చేసే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉండాలని వాదించడానికి వీలుండాలి అన్నట్టుగా ఉంది. అంటే పొరపాట్లు చేస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉన్నతాధికారులకు ఉండాలన్నది ఈ లేఖ సారాంశం. ఉన్నతాధికారులు ఇలాంటి పాత్ర నిర్వహిస్తే వారికి ఊరట కలగడమే కాకుండా వారి విశ్వసనీయత పెరుగుతుంది. ఇందులో ఉన్నతాధికారుల పాత్ర మూక దాడులకు గురయ్యే సామాజిక వర్గాలకు ఊరట కలిగించే అవకాశం ఉండాలన్న సూచన కూడా ఉంది.

ఒకే వ్యక్తి సర్వాధికారాలు చెలాయించే చోట రాజ్యాంగానికి నిబద్ధులై పని చేసే అవసరం ఎప్పుడూ ఉంటుంది. మూడవది-ప్రభుత్వం విఫలమవుతున్నందువల్ల మూక దాడులు విచ్చలవిడిగా కొనసాగడంతో అధికారవర్గం నిర్వీర్యంగా మిగిలిపోతోంది. సమాజంలో ఉన్నతాధికార వర్గాల పాత్ర ఎందుకూ కొరగాకుండా పోతోంది. మన దేశంలో రాజ్యాంగానికి నిబద్ధమై పని చేసే ఉన్నతాధివర్గం అవసరం. అలాంటి అవసరం లేదా? సిద్ధాంతాలు, రాజకీయాలకు సంబంధించినంత మేరకు ఉన్నతాధికారవర్గం నిష్పాక్షికంగా ఉండాలి. చివరగా ఈ లేఖలో మాజీ ఉన్నతాధికారులు చెప్పదలచుకున్నది ఏమిటంటే ఉద్యోగ విరమణ తర్వాత కూడా తాము మరింత ఉదాత్తమైన ఆశయాల కోసం, సమాజానికి మేలు చేయడం కోసం ఏ రాజకీయ పక్షంతో చేరకుండానే స్వేచ్ఛ, మానవ గౌరవం వంటి రాజకీయ సూత్రాలను పరిరక్షించడానికి జోక్యం చేసుకోగలం అని చెప్పడం. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాలను అస్సలే ఖాతరు చేయడం లేదు. మరో రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలలో చేరిన మాజీ ఉన్నతాధికారులు తమ నిర్ణాయక విశ్వసనీయతను నిరూపించుకోవలసి ఉన్నప్పటికీ విద్వేషానికి, అవమానానికి వ్యతిరేకంగా పోరాడగలమని కూడా ఈ లేఖ నిరూపిస్తోంది.

నిజమైన ప్రభుత్వాధికారులు ఉద్యోగంలో ఉన్నప్పుడే కాక ఆ తర్వాత జీవితాంతం రాజ్యాంగ సూత్రాలకు నిబద్ధులై ఉండాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైద్ధాంతిక, రాజకీయ ప్రమేయం లేకుండానే వారు సజావుగా వ్యవహరించవచ్చు. ఉన్నతాధికార వర్గం న్యాయం, రాజకీయాలు, సిద్ధాంతంలాంటి వాటితో సంబంధం లేకుండానే సవ్యంగా ప్రవర్తించవచ్చు. ఈ కొలమానాలతో చూస్తే అధికారవర్గం శాంతి, సామరస్యం, న్యాయం అన్న రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉండవచ్చు. రాజకీయాలు, సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండానే అధికారవర్గం తటస్థంగా ఉండవచ్చు. అయితే ఈ నడవడిక తమకు ఉందని నిరూపించుకోవలసిన బాధ్యత ఏదో రాజకీయ పార్టీలో చేరిన, లేదా చేరాలనుకుంటున్న ఉన్నతాధికారుల మీద మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ అధికారులు అనేక కారణాలవల్ల రాజకీయాలలో చేరవచ్చు. అయితే తాము ఉద్యోగంలో ఉండగా తమ పని తీరు రాజ్యాంగ సూత్రాలకు ఏ మేరకు అనువుగా ఉందో నిరూపించుకోవలసిన బాధ్యత కూడా వారి మీదే ఉంటుంది. సామాజికంగా సక్రమ నడవడిక లేని పార్టీలు ఉన్నతాధికారులను తమ పార్టీల్లో చేర్చుకునేటప్పుడు సాధారణంగా ఈ విషయాలు పట్టించుకోవు. ఉద్యోగ విరమణ తర్వాత కులాభిమానం, పితృస్వామ్య లక్షణాలు, విద్వేషం ప్రదర్శించే ఉన్నతాధికారులు ఉండనే ఉంటారు. మన దేశంలో ఉన్నతాధికార వ్యవస్థ నిర్మాణం నిరంకుశాధికారం చెలాయించే రీతిలోనే ఉంటుంది. పరిపాలన లో ఒక వ్యక్తి కులం వారి బదిలీ ఉత్తర్వులకన్నా వేగంగా తెలిసిపోతుంది. కులం, లింగం, ప్రాంతం, మతం, భాష మొదలైన విభేదాలు ఉన్నతాధికారుల్లో కనిపిస్తాయి.

ప్రభుత్వాధికారులకు పరస్పర సంబంధం ఉన్న రెండు నైతిక ధర్మాలు ఉంటాయి. ఒకటి-వారు ఏ వ్యవస్థలో భాగమో ఆ వ్యవస్థకు భంగం కలుగుతున్నప్పుడు దాన్ని పరిరక్షించవలసిన బాధ్యత వారిదే. రెండు-కులం, పితృస్వామిక భావజాలంతో కూడిన సమాజానికి భంగం కలిగించవచ్చు. ఇలాంటి స్థితిలో సమాజం తీవ్రమైన ఛాందసత్వంలోకి దిగజారకుండా చూడవలసిన బాధ్యత అధికారవర్గం మీద కూడా ఉంటుంది. ఈ రెండు నైతిక బాధ్యతలు నిర్వర్తించాలంటే ఉన్నతాధికారులు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినప్పుడు నిరోధించగలగాలి. మరో వేపు వారు క్రియాశీల పాత్ర పోషించి ఈ రాజ్యాంగ సూత్రాలను నిత్య జీవితంలో, ప్రజాసమస్యలను పరిష్కరించడంలో కూడా ఆచరించి చూపాలి. ఎందుకంటే సమాజం సభ్యతతో, శాంతియుతంగా కొనసాగడానికి ఈ పాత్ర పోషించడం అత్యవసరం. ఈ దృష్టి ఉన్న వారు ఉన్నతాధికారులు చూపే ఆధిపత్యాన్ని చెలాయించకూడదు. తమ స్వార్థ దృష్టితో వ్యవహరించ కూడదు. సామాజిక సంబంధాలలో వారు విస్తృతమైన పాత్ర పోషించాలి. శాంతియుత పద్ధతుల్లో జోక్యం చేసుకోవడంద్వారా ఉన్నతాధికారులు సామాజిక సంబంధాలకు భంగం కలగకుండా చూడవచ్చు. దీనికోసం వారు మధ్యవర్తిత్వం నెరపవచ్చు. నచ్చ చెప్పవచ్చు. చర్చించవచ్చు. అయితే ఉన్నతాధికారులు తమ స్వార్థం కోసం పని చేయకూడదు. అందువల్ల ఈ ఉన్నతాధికారులు రాసిన లేఖలో చెప్పిన అంశాలు ఆచరించి చూపడం వారి నైతిక కర్తవ్యం. అప్పుడే ప్రభుత్వాధికారులు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి బానిసలుగ తయారు కాకుండా ఉండడం సాధ్యం అవుతుంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top