ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఫాసిస్టు శక్తుల క్రీనీడలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

జనవరి 19 నుంచి 21 దాకా కోల్ కతాలో సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సమావేశంలో రాజకీయ తీర్మానం ముసాయిదాపై జరిగిన చర్చ సహజంగానే వామపక్ష, ప్రగతిశీల వర్గాలలో ఆసక్తి రేకెత్తించింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ రెండవ సారి అధికారంలోకి వస్తే అర్థ ఫాసిస్టు లేదా ఫాసిస్టు పోకడలు తలెత్తుతాయాన్న భయమందోళనలు ఈ సమావేశంలో కొంత మందిలో వ్యక్తమైనాయి. అదే జరిగితే వామపక్ష పార్టీలపై ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవాల్సిన అగత్యం ఉంది కనక అది వారికి జీవన్మరణ సమస్యే. ఫాసిస్టు శక్తులను ఓడించడం వామపక్షాల మీద ఉన్న చారిత్రక కర్తవ్యం. దేశంలో ఫాసిస్టు పోకడలు ఉన్నాయా లేదా, ఒక వేళ ఉంటే ఆ శక్తులను ఎదుర్కోవడానికి ఎలాంటి ఐక్య సంఘటన అవసరం అవుతుందన్న చర్చ 2016 సెప్టెంబర్ నుంచే కొనసాగుతోంది.

ఫాసిజం తలెత్తడానికి అవసరమైన పరిస్థితులు దేశంలో లేవనీ, ఒక వేళ ఉన్నా ఆ అవకాశం చాలా బలహీనంగా ఉందన్న  అభిప్రాయమే సీపీఐ (ఎం) నాయకులలో ఎక్కువ మందిలో ఉంది. ఈ వాదనను సీపీఐ (ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంచనాను ఫాసిస్టు శక్తుల క్రీనీడలు

జనవరి 19 నుంచి 21 దాకా కోల్ కతాలో సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సమావేశంలో రాజకీయ తీర్మానం ముసాయిదాపై జరిగిన చర్చ సహజంగానే వామపక్ష, ప్రగతిశీల వర్గాలలో ఆసక్తి రేకెత్తించింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ రెండవ సారి అధికారంలోకి వస్తే అర్థ ఫాసిస్టు లేదా ఫాసిస్టు పోకడలు తలెత్తుతాయాన్న భయమందోళనలు ఈ సమావేశంలో కొంత మందిలో వ్యక్తమైనాయి. అదే జరిగితే వామపక్ష పార్టీలపై ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవాల్సిన అగత్యం ఉంది కనక అది వారికి జీవన్మరణ సమస్యే. ఫాసిస్టు శక్తులను ఓడించడం వామపక్షాల మీద ఉన్న చారిత్రక కర్తవ్యం. దేశంలో ఫాసిస్టు పోకడలు ఉన్నాయా లేదా, ఒక వేళ ఉంటే ఆ శక్తులను ఎదుర్కోవడానికి ఎలాంటి ఐక్య సంఘటన అవసరం అవుతుందన్న చర్చ 2016 సెప్టెంబర్ నుంచే కొనసాగుతోంది.

 

ఫాసిజం తలెత్తడానికి అవసరమైన పరిస్థితులు దేశంలో లేవన్న, ఒక వేళ ఉన్నా ఆ అవకాశం చాలా బలహీనంగా ఉందన్న  అభిప్రాయమే సీపీఐ (ఎం) నాయకులలో ఎక్కువ మందిలో ఉంది. ఈ వాదనను సీపీఐ (ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంచనాను సీపీఐ (ఎం)లో ఎక్కువమంది సమర్థిస్తున్నారు. అయితే రాజ్య వ్యవస్థలోని కొన్ని వ్యవస్థలను వినియోగించుకుని, హిందుత్వ దళాలు సామాజిక వ్యవస్థను మార్చడానికి కృత నిశ్చయంతో చేస్తున్న ప్రయత్నాల కారణంగా ప్రజాస్వామ్యానికి, సెక్యులరిజానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న అభిప్రాయం మాత్రం సీపీఐ (ఎం) లో అందరికీ ఉంది. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఏం చేయాలి అన్న విషయంలో సీపీఐ (ఎం) కేంద్ర కమిటీలో అత్యధిక సంఖ్యాకులు "నయా ఉదారవాదం", "మతతత్వం" అనే రెండు సమస్యలను ఏక కాలంలో ఎదుర్కోవాలి అని భావిస్తున్నారు. అందువల్ల బీజేపీలాగే నయా ఉదారవాద విధానాన్ని అనుసరించే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటంలో వామపక్షాలకు తోడు నిలవదు అన్న భావన ఉంది.

మరో వేపున ప్రస్తుతం సీపీఐ (ఎం) అగ్రనాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి "కాంగ్రెస్ తో పొత్తూలేదు, అవగాహనా లేదు" అన్న వాదన అర్థరహితమైందని భావిస్తున్నారు. కాని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సమావేశంలో ఏచూరి వాదన వీగిపోయింది. కేంద్ర కమిటీలో చర్చించడానికి రూపొందించిన ముసాయిదా తీర్మానాన్ని సవరించి కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తూ ఉండకూడదని తీర్మానించింది. ఏప్రిల్ లో జరగనున్న సీపీఐ (ఎం) మహాసభలో దీనికి విరుద్ధమైన వైఖరిని అత్యధిక సంఖ్యాకులు అనుసరిస్తే తప్ప ప్రకాశ్ కారత్ నాయకత్వంలోని మెజారిటీ సభ్యుల అభిప్రాయమే సీపీఐ (ఎం) విధానంగా ఉంటుంది.

ఈ అంశాన్ని ఒక్క సీపీఐ (ఎం) దృష్టితో మాత్రమే కాకుండా చూస్తే 1920ల్లో, 1930ల్లో జర్మనీలో వామపక్షాలు చేసిన పొరపాటును గమనించి అంచనా వేస్తే దేశంలోని వామపక్షాలన్నీ అర్థ ఫాసిజాన్ని ఎదిరించాలంటే విశాల ప్రాతిపదికపై వామపక్షాలన్ని "సమైక్య ఫ్రంట్" గా ఏర్పడాల్సిందే. కేవలం పార్లమెంటరీ పంథాను అనుసరించే వామపక్షాలే కాకుండా, తీవ్రవాద విధానాలను అనుసరించే వామపక్షాలు, సోషలిస్టు భావాలు ఉన్న వారు ఏకం కాక తప్పదు. వామపక్ష వాదుల్లో కమ్యూనిస్టులు బాగా జీర్ణించుకుపోయిన ఒంటెత్తు పోకడ విడనాడి సోషలిస్టు సంప్రాదాయం ప్రకారం బహుళత్వాన్ని అనుసరించవలసిందే. అంతే కాక ఈ ఐక్య సంఘటన నయా ఉదారవాద విధానాలను వ్యతిరేకించేది అయి ఉండాల్సిందే. ఉదారవాద విధానాల పుణ్యమా అని పెట్టుబడి సమకూర్చే పద్ధతి వచ్చినందువల్ల భయంకరమైన వర్గాలు చెదిరిపోకుండా చూడాలి. దానితో పాటు ధన బలంతో ఎన్నికల ప్రక్రియను పక్క దారి పట్టించకుండా ఉండాలి. ఉదారవాదుల ఆధిపత్యాన్ని ఎదుర్కోవాల్సిందే.

అలాంటి ఐక్య సంఘటన పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించే పార్టీలతో, ప్రభుత్వాలతో  ఎప్పుడు, ఏ రూపంలో ఐక్య సంఘటన ఉండాలో నిర్ణయించాలి. మితవాద పక్షాలతో, ప్రభుత్వాలతో ఎప్పుడు ఐక్య సంఘటన ఏర్పాటు చేయాలో కూడా నిర్ణయించుకోవాలి. ఫాసిస్టు వ్యతిరేక శక్తులను కలిపి "జాతీయ ఐక్య సంఘటన" ఏర్పాటు చేయాలి. ఈ ఐక్య సంఘటన వివక్షను, విద్వేషాన్ని ముఖ్యంగా ముస్లింల పట్ల విద్వషాన్ని గమనంలో ఉంచుకోవాలి. దీన్ని కేవలం మతాల వారీగా చూడకూడదు. వ్యవస్థాపరంగా ఉన్న అసమానతలను గుర్తించాలి. చాలా మంది ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారు దోపిడీకి గురైన వారు, అణచవేతకు గురైన వర్గాలకు చెందిన వారేనన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఈ విషయాన్ని జాతీయ సంఘటనల్లో ప్రస్ఫుటంగా వ్యక్తం చేయాలి.

ప్రస్తుతం ముస్లిం యువతలోఅనేక మంది పోలీసుల చేతిలో, నేర నిర్ధానణ చేసే న్యాయ వ్యవస్థ చేతిలో నలిగి పోతున్నారని గ్రహించాలి. నిజానికి హిందుత్వ వాద జాతీయ వాదుల చేతిలో, రాజ్య వ్యవస్థ మద్దతుతో ముస్లింలు అవమానకరమైన రీతిలో బాధలు అనుభవిస్తున్నారని గమనించాలి. న్యాయస్థానాలు, పోలీసులు ఈ వర్గాలవారికి న్యాయం చేయడంలో విఫలమవుతున్నాయి. అందువల్ల ఈ వర్గంలో చాలా మందికి రాజ్య వ్యవస్థ మీదే నమ్మకం సన్నగిల్లుతోంది. ఏ ఐక్య సంఘటన అయినా అందులో ముస్లింలకు, హిందుత్వ వాద బ్రాహ్మణీక వ్యవస్థ చేతిలో నలిగిపోతున్న వారికి చోటు కల్పించాల్సిందే. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వివక్షకు, దోపిడీకి, అణచివేతకు గురవుతున్న వర్గాల వారికి ఈ ఐక్య సంఘటనలో చోటు ఉండాలిసందే.

ఫాసిజం, అర్థ ఫాసిజం మూలాలు, సామాజిక, ఆర్థిక, మానసిక అంశాలను గ్రహించగలిగితేనే ఈ ఐక్య సంఘటన ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడే ప్రజా ఫ్రంట్, జాతీయ ఫ్రంట్ ఏర్పడడానికి వీలుంటుంది. సంఘ్ పరివార్ లోని రాజకీయ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఒక వేళ ఈ పార్టీ 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే హిందుత్వవాద "జాతీయతా" వాదుల మద్దతు ఉన్నఈ ప్రభుత్వం ఉదారవాద-రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కూడా కాల రాసి హిందూ రాష్ట్ర లక్ష్య సాధనకు ప్రయత్నిస్తుంది. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top