ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

పెద్ద నోట్ల రద్దు విధ్వంసం బట్టబయలు

.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మోదీ ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లలో 99.3 శాతం వెనక్కి వచ్చాయి అని రిజర్వూ బ్యాంకు (ఆర్.బి.ఐ.) 2017-18 నివేదికలో తెలియజేసింది. అంటే నల్ల ధనం రద్దు చేయడానికే పెద్ద నోట్లను రద్దు చేశామని ప్రభుత్వం అట్టహాసంగా చేసిన ప్రచారం బూటకం అని తేలిపోయింది. రద్దు చేసిన నోట్ల గురించి రిజర్వూ బ్యాంకు నివేదిక విడుదల చేయడం ఇది మొదటి సారి ఏమీ కాదు. రద్దు చేసిన రూ. 15.42 ట్రిలియన్ నోట్లలో 12.44 ట్రిలియన్ నోట్లు తిరిగి వచ్చాయని నోట్లను రద్దు చేసిన మరుసటి నెల నివేదికలోనే వెల్లడైంది. ఈ లెక్కలు లోపభూయిష్టమైనవని అప్పుడు ప్రభుత్వం తోసిపుచ్చింది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో రూ. 3 నుంచి 5 ట్రిలియన్ల విలువగల నల్లధనం ఉందని ప్రభుత్వం చెప్పిన దానికి రిజర్వూ బ్యాంకు లెక్కలు భిన్నంగా ఉన్నందువల్ల ప్రభుత్వం వాస్తవాన్ని నిరాకరించడంద్వారా సంతృప్తి పడింది.

రద్దయిన ఎన్ని పెద్ద నోట్లు వెనక్కు వచ్చాయో లెక్క తేల్చడంలో రిజర్వూ బ్యాంకు కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంది. ఏడాది కిందట 2017 జూన్ 30న తన వార్షిక నివేదికలో రూ. 15.28 ట్రిలియన్ల విలువ చేసే నోట్లు వెనక్కు వచ్చాయని తెలియజేసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని, ప్రజలను సంతృప్తి పరచడానికి కాబోలు "వెనక్కు వచ్చిన నోట్లను లెక్కించే బృహత్కార్యాన్ని" విజయవంతంగా పూర్తి చేశామని చెప్తోంది. అంటే నోట్లు లెక్క పెట్టడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఇన్ని నోట్లను లెక్క వేసిన తర్వాత కనిపించిన తేడా ఎంత అంటే కేవలం 0.2 శాతం మాత్రమే. రూ. 15.28 కాస్తా 15.31 శాతానికి పెరిగింది. ఇంతకీ వెనక్కి రాని నోట్లు ఎన్ని అంటే రూ. 0.11 ట్రిలియన్లు (అంటే కేవలం 0.7 శాతం) మాత్రమే.

ఇది ప్రభుత్వానికి పెద్ద చెంప పెట్టు. అయినా ప్రభుత్వం ఈ అవమానభారాన్ని ఖాతరు చేయడం లేదు. ఆర్.బి.ఐ. కి ఎదురైన అవమానం నిజానికి ఇంతకన్నా పెద్దదే. పెద్ద నోట్లు చాలా అప్రజాస్వామిక పద్ధతిలో రద్దు చేశారు. ప్రసిద్ధ వ్యవస్థల అభిప్రాయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా అగౌరవ పరిచారు. పెద్ద నోట్లు రద్దు చేయడానికి ఏడాదికి ముందే ఈ ప్రతిపాదనను తాను వ్యతిరేకించానని చెప్పారు. అంతకు మునుపు ఉన్న ఆర్.బి.ఐ. గవర్నర్లు కూడా వ్యతిరేకించారు. ఆర్.బి.ఐ. రికార్డులను బట్టి చూస్తే సంపన్న కుటుంబాలు నగదు రూపంలో తమ సంపత్తిని దాచుకోవు. ఈ కారణంగానే ఆర్.బి.ఐ. పెద్ద నోట్ల రద్దును తిరస్కరించిన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఆర్.బి.ఐ. అధికారంలో ఉన్న ప్రక్షం ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటోంది. మేధోపరమైన విశ్లేషణకు తావివ్వడం లేదు.

ఇంతకు ముందు పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు మొత్తం చెలామణిలో ఉన్న నగదులో అవి 0.6 శాతం మాత్రమే ఉండేవి. ఇప్పుడు 86 శాతం పెద్ద నోట్లే. అందువల్ల కుటుంబాలలో ఎంత నగదు నిలవ ఉంటుంది, దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఏమిటి అన్న కోణాలను ఆర్.బి.ఐ. మేధోపరంగా విశ్లేషించవలసింది. 2017లో పెద్ద నోట్ల రద్దు వల్ల చెలామణిలో ఉన్న నోట్లలో 20 శాతం తగ్గిందని, ఇది స్థూల జాతీయోత్పత్తిలో 8.8 శాతం అని, అంతకన్నా ముందు ఏడాదిలో ఇది 12.2 శాతం అని ఆర్.బి.ఐ. తెలియజేసింది. ఈ రకంగా భారత్ లో చెలామణిలో ఉన్న నోట్లు స్థూల జాతీయోత్పత్తి రేటు ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల లాగే ఉంది అని కూడా ఆర్.బి.ఐ. తెలియజేసింది. కానీ వాస్తవం ఏమిటంటే మన దేశంలో చెలామణిలో ఉన్న నోట్లు అభివృద్ధి చెందుతున్న దేశాలలోకన్నా, సంపన్న దేశాలలోకన్నా ఎక్కువే. ఎందుకంటే మన దేశంలో అవ్యవస్థీకృత రంగం విస్తారమైంది.

2013లో సేకరించిన ఆరవ ఆర్థిక గణాంకాల ప్రకారం మొత్తం 454 లక్షల వ్యవసాయేతర వ్యవస్థలలో 92 శాతం ప్రైవేటు రంగంలో ఉన్న వ్యవస్థలే. ఇవి ప్రభుత్వం దగ్గర పరిశ్రమలుగా నమోదైనవి కావు. అయితే ప్రొప్రైటరీ సంస్థలు లేదా భాగస్వామ్య సంస్థలు. లేదా చిన్న చిన్న ప్రవేటు పరిశ్రమలు. అలాగే పని చేసే వారిత్లో 92 శాతం అవ్యవస్థీకృత రంగంలో పని చేసే వారే. "తక్కువ నగదు" వాడే సమాజం అవతరించాలి అన్న ప్రస్తుత వాతావరణంలో కూడా 2017-18లో నగదు చెలామణి 37 శాతం పెరిగింది. స్థూల జాతీయోత్పత్తిలో నోట్లు 2016-17లో 8.8 శాతం ఉంటే 2017-18లో 10.9 శాతానికి పెరిగాయి. ఈ లక్షణం బహుశః మన ఆర్థిక వ్యవస్థలో అంతర్నిహితమైంది కావచ్చు. అయినప్పటికిన్నీ ఆర్.బి.ఐ. కరెన్సీ వాడకంలో మన దేశం ఎదుగుతున్న మార్కెట్లు ఉన్న దేశాలతో, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్య్వస్థలతో పోటీ పడుతోంది అని చెప్తోంది.

దేశ ఆర్థిక వ్యవస్థను, కుటుంబాల నడవడికను గమనంలో ఉంచుకుంటే దుస్సాహసంగా పెద్ద నోట్ల రద్దువల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు అనుభవించవలసి వచ్చిందో ఆర్.బి.ఐ. చెప్పి ఉండేది. నోట్ల రద్దువల్ల ఉత్పత్తికి, ఉపాధికి, పౌరులు జీవనానికి ఎంత నష్టం కల్గిందో మేధావులు, మీడియా ఎన్ని వివరాలు వెల్లడించినా నోట్ల రద్దువల్ల ఎంత ప్రతికూల ప్రభావం కలిగిందో ఇప్పటికీ సరైన అంచనా లేదు. అవ్యవస్థీకృత రంగానికి సంబంధించిన లెక్కలను గణాంకాలు సేకరించే వ్యవస్థలు సరిగ్గా సేకరించకపోవడం ఒక కారణం కావచ్చు. స్థూల జాతీయోత్పత్తిలో అవ్యవస్థీకృత రంగం వాటా ఎంతో తేల్చడానికి వ్యవస్థీకృత రంగానికి ఉపయోగించే కొలమానాలే వినియోగిస్తారు. అందువల్ల స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల అవ్యవస్థీకృత రంగం పాత్ర కూడా ఉంది అనడం పొరపాటు.

పెద్ద నోట్ల రద్దు నల్ల ధనాన్ని అరికట్టడంలో విఫలమయ్యే సరికి నోట్ల రద్దు అసలు లక్ష్యం తీవ్రవాదాన్ని, నక్సలిజాన్ని అదుపు చేయడం అన్న సాకులు చెప్పడం ప్రారంభించారు. బూటకపు కంపెనీలను మూసివేయించడానికి, పన్నులు చెల్లించే వారి సంఖ్య పెంచడానికి, డిజిటల్ రూపంలో చెల్లింపులకు నోట్ల రద్దు ఉపయోగపడిందని వక్ర భాష్యాలు చెప్తున్నారు. నోట్ల రద్దు ద్వారా దేశ ప్రజలందరినీ కష్టాలకు గురి చేయకుండానే ఈ లక్ష్యాలన్నింటినీ సాధించి ఉండవచ్చు. ముఖ్యంగా పేదలను ఇబ్బంది పెట్టకుండా ఉండే వీలుండేది.

Back to Top