ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఆ చారిత్రక తప్పిదానికి 70 ఏళ్లు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఇజ్రాయిల్ అస్తిత్వంలోకి వచ్చి 70 ఏళ్లు కావస్తోంది. ఇన్నేళ్లుగా ఇజ్రాయిల్ మనుగడ కొనసాగింది యుద్ధాలవల్లే. అరబ్ ప్రపంచంలో జరుగుతున్న ఘర్షణల్లో ఇజ్రాయిల్ ఏదో ఒక పక్షం కొమ్ము కాస్తుంది. ఇది అంతిమంగా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించే దశకు వచ్చింది. ఆ యుద్ధంలో ఇప్పుడు సిరియా భూభాగంలో కూడా జరుగుతోంది. గత మేలో కనిపించిన శకునాలనుబట్టి చూస్తే సమీప భవిష్యత్తులో ఘర్షణలు మరింత విపరీతం అయ్యే పరిస్థితే కనిపిస్తోంది.

ఈ ఘర్షణకు మే ఎనిమిదవ తేదీనా అమెరికా ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. జాతి ఉన్మాదులతోనూ, అన్ని రకాల సెమెటిక్ జాతి వ్యతిరేకులతోనూ కత్తు కలిపిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూదు రాజ్యం (ఇజ్రాయిల్) కోర్కెలన్నింటికీ ఒప్పేసుకున్నారు. ఇరాన్ అణు పరిశోంధనా కార్యక్రమాలకు ఇచ్చిన హామీల ఒప్పందం నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ట్రంప్ ఇటీవల ప్రకటించారు.

ఈ ఒప్పందం 2015 జులైలో కుదిరింది. ఇరాన్, అమెరికా, మరో అయిదు భాగస్వామ్య పక్షాల మధ్య సుదీర్ఘమైన సంప్రదింపుల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం చాలా పటిష్టమైందని నిపుణులు భావించారు. అమలు చేయడానికి అనువైందని కూడా అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఒంటరి అయిపోయిన ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించవచ్చునని, అది తమ అస్తిత్వానికి ప్రమాదం అని ఇజ్రాయిల్ భావించింది..

ఈ లోగా ఇజ్రాయిల్ మొత్తం మానవాళి చరిత్రను, అస్తిత్వాన్ని తుడిచిపెట్టే యుద్ధ తంత్రాల్లో నిమగ్నమై ఉంది. ఇజ్రాయిల్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని జెరుసలేం కు మారుస్తామని ట్రంప్ ప్రకటించడంతో ఇజ్రాయిల్ కు పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. ఈ మార్పు మే 14వ తేదీన జరుగుతుంది. ఆ రోజు ఇజ్రాయిల్ అస్తిత్వంలోకి వచ్చిన రోజు. పలస్తీనియన్లు ఆ రోజును "నబ్క" అంటే మహావిపత్తులా భావిస్తారు. మార్చి మధ్యలోనుంచే పలస్తీనియన్లు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. అంతకు ముందు ఇజ్రాయిల్ ఆక్రమించుకున్న ప్రాంతం, బహిరంగ జైలు లాంటి గాజా దాకా మూకుమ్మడి నిరసన యాత్రలు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయిల్ ఇంతకు ముందు ఆక్రమించుకున్న ప్రాంతానికి, గాజాకు మధ్య చిక్కని కంచె ఉంటుంది.

గాజాలో ఉన్న మూడింట రెండు వంతుల జనాభా శరణార్థులే. వీరిలో చాలా మంది ఇజ్రాయిల్ దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి అనేక సార్లు ఒక చోటి నుంచి మరో చోటికి శరణార్థులుగా వెళ్లిన వారే. పలస్తీనియన్లు ఈ యాత్ర చేపట్టడంలో ప్రధాన ఉద్దేశం తాము కోల్పోయిన తమ భూభాగాన్ని మళ్లీ పొందాలన్న ఆకాంక్షను బలంగా వ్యక్తం చేయడమే. ఈ నిరసన యాత్ర సాగిన ఆరు వారాల సమయంలో ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో 51 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ హత్యా కాండ "చట్ట విరుద్ధమైంది" అని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం దీని మీద విచారణ చేపట్టాలని కూడా కోరింది.

హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ మాటలు పూర్తిగా అమెరికా పట్టించుకోనితనానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయిల్ ఏర్పడి 70 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఇజ్రాయిల్ వ్యవహరిస్తున్న తీరును అంతర్జాతీయ సమాజం సమర్థిస్తున్న వైనాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరించాలి. ఆత్మ రక్షణకు ఇజ్రాయిల్ కు హక్కు ఉంది అని భావిస్తున్న తరుణంలో నిరాయుధులైన వారిని హతమారుస్తున్న ఇజ్రాయిల్ ఎలా అంతమొందిస్తుందో గ్రహించాలి. తమ అస్తిత్వం కోసం ఇజ్రాయిల్ తమ పొరుగున ఉన్న దేశాల మీద ఎలాంటి అపరాధభావం లేకుండా హత్యాకాండ కొనసాగిస్తోంది. ఈ ప్రశ్నకు కొంత కాలంగా ఇజ్రాయిల్ రాజకీయ నాయకుల్లో కొందరు సమాధానం చెప్తూనే ఉన్నారు. ఇజ్రాయిల్ "జాతి వివక్షకు" గురవుతోందని, ఇంతవరకు అలా జరగకుండా ఉంటే ఆ స్థితిలోకి జారుకుంటోందని ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి ఎహుద్ బరాక్ హఠాత్తుగా నిద్రలోంచి లేచి వెచ్చి ప్రమాద ఘంటికలను మోగించారు. ఆయన చెప్పిన మాట ఒక రకంగా అసత్యం కాదు. ఎందుకంటే ఇజ్రాయిల్ పార్లమెంట్ నెసెట్ మాజీ స్పీకర్ 2003లోనే ఇజ్రాయిల్ జాతి వివక్షకు గురికావడం భవిష్యత్తులో ఎప్పుడో జరిగేది కాదని ఇప్పటికే ఆ దశకు చేరుకుందని అన్నారు.

ఇజ్రాయిల్ ఏర్పడిన నాటి నుంచే జనాభా స్వరూపం మారుతోందని నానా యాగీ చేస్తోంది. ఆక్రమిత ప్రాంతానికి యూదులను భారీ సంఖ్యలో ఇజ్రాయిల్ తరలించింది. ఆచరణలో అది సాధ్యం కాదని గ్రహించిన తర్వాత ఏకపక్షంగా విడిపోవాలని సంకల్పించింది. "రెండు రాజ్యాల పరిష్కారం" అని బరాక్ 2000 సంవత్సరంలోనే ప్రతిపాదించారు.

మళ్లీ శాంతి ప్రక్రియ ప్రారంభించడానికి 2008లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ అన్నపోలిస్ లో ఉభయ పక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ దశలో ఇజ్రాయిల్ సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన విపరీతమైన మితవాద ఆధిపత్యం నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తుండేది. కానీ ఆ అన్నపోలిస్ సమావేశంలో శాంతిని కోరే వాడు అన్న అభిప్రాయం ఉన్న ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయిల్ అస్తిత్వాన్ని శాశ్వతంగా గుర్తిస్తే తప్ప పలస్తీనా సమస్యపై చర్చలు సాధ్యం కావు అని తెగేసి చెప్పారు. ఇజ్రాయిల్ ను యూదు రాజ్యంగా గుర్తించాలని గట్టిగా కోరారు. అంటే శరణార్థులు తమ స్వస్థలానికి తిరిగి వచ్చే హక్కును శాశ్వతంగా కోల్పోవడమే. ఇజ్రాయిల్ లో పలస్తీనియన్లు మైనారిటీలుగా ఉండే అవకాశం కూడా కోల్పోవడమే. ఇది పలస్తీనియన్లు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడక తప్పని పరిస్థితి. ఆ సమయంలో అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న కోండలీజా రైస్ "ఇజ్రాయిల్ రాజ్యం జాతి స్వచ్ఛత కాపాడుకోవడానికి" చేస్తున్న ప్రయత్నాన్ని చూసి ఆశ్చర్య చకితులయ్యారు.  కాని ఆ అభిప్రాయం లేదా బలహీనత కొద్ది కాలం మాత్రమే ఉంది. వెంటనే ఆమె తేరుకుని "ఇజ్రాయిలే ప్రధానం" అన్న వాదన లేవనెత్తారు.

ఒబామా హయాంలో అనుసరించిన ఆచరణవాదం వల్ల చాలా స్వల్పమైన ప్రయోజనం మాత్రమే కలిగింది. ట్రంప్ మాత్రం మళ్లీ పొరుగు దేశాల మీద నిరంతరం కయ్యానికి కాలు దువ్వుతూ మారణకాండ సృష్టిస్తున్న ఇజ్రాయిల్ ను లాలించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ మళ్లీ తన దుందుడుకు విధానాలను అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో అంతర్జాతీయ సమాజం ఆ విధానాల ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రసిద్ధ నాటక, సినిమా రచయిత టోనీ కుష్నెర్ చెప్పినట్టు ఇజ్రాయి “భయంకరమైన చారిత్రక తప్పిదం”.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top