ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

దారి మళ్లుతున్న పోషకాహార పథకం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

అంగన్ వాడీ కేంద్రాలలో పిల్లలకు ఎలాంటి పోషకాహారం అందించాలన్న విషయంలో మళ్లీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నీతీ ఆయోగ్, మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖల మధ్య పొంతన కుదరడం లేదు. "అధిక శక్తినిచ్చే ఫ్యాక్టరీల్లో తయారైన పదార్థాలను" ఇవ్వాలని, ఇంటికి తీసుకెళ్లే రేషన్ సరుకు ఏదీ ఇవ్వకూడదని మంత్రి భావిస్తున్నట్టు గత వారం వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ మంత్రి కన్నా ముందు ఆ శాఖను నిర్వహించిన మంత్రి కూడా గత దశాబ్దంలో ఇదే సూచన చేశారు. పిల్లలకు అందించే ఆహారం ఈ పద్ధతిలో అయితే మరింత నాణ్యంగా ఉంటుందని, పరిశుభ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భారత పోషకాహార సవాళ్ల జాతీయ మండలి సమావేశంలో నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినందువల్ల ఈ వివాదం ప్రస్తుతానికి సద్దు మణిగినట్టే. దానికి బదులు 2013 నాటి జాతీయ ఆహార భద్రతా చట్టం, 2007 నాటి శిశు సమగ్రాభివృద్ధి సేవలు (ఐ.సి.డి.ఎస్.) పథకం నిబంధనల కింద అంగన్ వాడీల్లో ఆహారం తయారు చేయడంలో తల్లులను భాగస్వాములను చేయాలని నీతీ ఆయోగ్ సూచించింది. జాతీయ ఆహార భద్రతా పథకం కింద ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలందరికీ, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు రోజుకు ఒక సారి అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా ఆహారం సరఫరా చేసే అవకాశం ఉంది. ఇది ఇంటికి తీసుకెళ్లే ఆహారంగా కూడా ఉండవచ్చు. లేదా వేడి వేడిగా వండి అందించవచ్చు. స్వయం సహాయక బృందాల ద్వారా కూడా పోషకారం అందించవచ్చునని జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం శమగ్ర శిశు అభివృద్ధి పథక నిబంధనలు చెప్తున్నాయి.

చాలా కాలంగా ఐ.సి.డి.ఎస్. కింద అనేక రాష్ట్రాలలో ఇంటికి తీసుకెళ్లే ఆహార పదార్థాలను ప్రైవేటు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. ఇందులో అవినీతి, ఆహార పదార్థాలు దారి మళ్లడం వంటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐ.సి.డి.ఎస్. కోసం ప్రైవేటు కాంట్రాక్టర్ల సరఫరా పద్ధతిని సుప్రీంకోర్టు నిషేధించింది. స్థానిక స్యయం సహాయక సంఘాలు, మహిళా మండలులవంటి గ్రామ స్థాయి సంస్థలకు అవకాశం ఇవ్వాలని సూచించింది. అయినా చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని "స్వయంగా తయారు చేసే" సంస్థలుగానో, చాలా సార్లు మహిళా మండలుల రూపంలోనో ఇదే కాంట్రాక్ట్రర్లు సరఫరా చేయడం కొనసాగింది. ఈ విషయంలో రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు, సరఫరాదార్లకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని సుప్రీంకోర్టు తరఫున పని చేసే కమిషనర్లు బహిర్గతం. ఐ.సి.డి.ఎస్. కోసం మహారాష్ట్రలో ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్న మహిళా మండళ్లపై దర్యాప్తు చేయించాలని కూదా కమిషనర్లు కోరారు. ఆ మహిళా మండళ్లు నకిలీవని, అవి నిజానికి అంతకు ముందు ఉన్న కాంట్రాక్టర్లు సృష్టించినవేనని కమిషనర్లు తెలియజేశారు. అప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ ప్రారంభించి మహిళా మండళ్లకు బాధ్యత అప్పగించింది. కాని వివిధ ప్రభుత్వాలు ముందున్న విధానాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టులో ఇప్పటికీ అనేక కేసులు విచారణలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పోషకాహార సరఫా పద్ధతిని వికేంద్రీకరించడానికి ప్రయత్నించినా అదీ కోర్టు కేసుల్లో చిక్కుకుంది.

ఐ.సి.డి.ఎస్. కింద పోషకారం అందించడానికి ప్రతి ఏటా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇది భారీ మొత్తం కనక చాలా వ్యాపార సంస్థలు తమ వాటా కోసం ప్రయత్నిస్తాయి. నిజానికి ఈ సొమ్మును వికేంద్రీకరిస్తే మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు. స్థానిక పంటలకు గిరాకీ ఉండేలా, స్థానికంగా మహిళలకు ఉపాధి కల్పించేలా చూడొచ్చు. స్థానికమైన, వైవిధ్యంగల ఆహారాన్ని అందిస్తే ఆ ప్రాంతం వారికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. శిశువులకు, బాలలకు మంచి ఆహారం అందుతుంది. ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం కేంవలం 9.6 శాతం మంది పిల్లకే నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉన్నట్టు తేలింది. వికేంద్రీకరణ సాధ్యమైతే స్థానిక పర్యవేక్షణ ఉంటుంది. తల్లులతో కమిటీలు వేసి పర్యవేక్షించవచ్చు. ప్యాకేజీ ఆహారం ఇవ్వాలన్న విషయమై వ్యర్థమైన చర్చ ఆపేసి వైవిధ్య భరితమైన పోషకాహారం అందించాలి. స్థానిక సమాజాలను సాధికారం చేసేలా, నాణ్యమైన పోషకాహారం అందించడం ముఖ్యం.

ఐ.సి.డి.ఎస్. కింద పోషకారం అందించడాన్ని పట్టాలు తప్పించడానికి ఇతర ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పోషకాహార సరఫరా వాణిజ్య ప్రయోజనాలకోసం దుర్వినియోగం కాకుండా నీతి ఆయోగ్ సరైన బాధ్యత నిర్వహించింది. కానీ ఆహారం సరఫరా చేయడానికి బదులు నగదు బదిలీ చేయాలని నీతి ఆయోగ్ ఆలోచిస్తోంది. నగదు బదిలీ అమలులో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. బ్యాంక్ సదుపాయాలు అందరికీ అందుబాట్లో లేవు. నగదు బదిలీ చేయడం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘించడమే. ఈ చట్టం కింద ఆహారమే అందించాలి. ఒక వేళ నగదు బదిలీ సత్వరం అమలు చేయాలంటే గత ఏడాది ప్రధానమంత్రి ప్రకటించిన గర్భిణీలకు రూ. 6000 అందించే పథకాన్ని అంతటా ఎందుకు అమలు చాయరు. పోషకాహార సరఫరాకు గండి కొట్టాల్సిన పనేమి ఉంది. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top