ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

పెడదారి పడ్తున్న న్యాయ వ్యవస్థ

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

తీవ్రవాదానికి సంబంధించిన కేసుల్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు న్యాయవ్యవస్థను పెడదారీ పట్టించేట్టుగా ఉన్నాయి.  మక్కా మసీద్ కేసులో అసీమానంద్, ఇతర నిందితులు, నరోదా పాటియా కేసులో మాజీ గుజరాత్ మంత్రి మాయా కొద్నానీ నిర్దోషిగా విడుదల కావడం, సోహ్రాబుద్దీన్ కేసులో తలసీ ప్రజాపతి ఎదురుకాల్పుల్లో మరణించిన సంఘటనలో విచారణ తీరు దేశంలో వివిధ కేసుల్లో న్యాయ ప్రక్రియ పక్కదారి పడ్టున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వం న్యాయ ప్రక్రియన్ తమ ఇష్టారీతిన వినియోగిందుకుంటోందని అనిపిస్తోంది.

మక్కా మసీదు కేసులో తీవ్రవాద దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలున్న అసీమానంద్ ను, మరో నలుగురిని జాతీయ దర్యాప్తు కోర్టు నిర్దోషులుగా తేల్చింది. వారి మీద కచ్చితమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల విడుదల చేస్తున్నట్టు ఈ కేసును విచారించిన న్యాయమూర్తి చెప్పారు. 17వ శతాబ్దానికి చెందిన హైదరాబాద్ లోని మక్కా మసీదులో 2007 మేలో భీకరమైన బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మరణించారు. 58 మంది గాయ పడ్డారు. మొదట పోలీసులు ఏ పాపం ఎరుగని ముస్లిం యువకుల మీద తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణ మోపారు. వారికి పాకిస్తాన్ లోని ఐ.ఎస్.ఐ.తో సంబంధం ఉందని పోలీసులు వారిని చిత్రహింసలు పెట్టి ఒప్పించారు. కాని ఈ కేసుపై దర్యాప్తు జరిపిన సీబీఐ హిందుత్వ తీవ్రవాదులు ఈ బాంబు పేలుళ్లకు బాధ్యులని తేల్చింది. దీనితో ముస్లిం యువకుల మీద మోపిన ఆరోపణలు కోర్టులో నిలవలేదు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు అసీమానంద్. తమ రాజకీయ ఎజెండాలో భాగంగా ఆర్.ఎస్.ఎస్., ఇతర హిందుత్వత్వ సంస్థలు దేశవ్యాప్తంగా ముస్లిల మీద దాడి చేయడానికి పథకం రూపొందించాయని 2010లో ప్రమాణం చేసి ఇచ్చిన వాంగ్మూలంలో అసీమానంద్ అంగీకరించారు. కారవాన్ పత్రికకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇదే విషయం చెప్పారు. చివరకు 2011లో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించినప్పుడు బలమైన సాక్ష్యాధారాలు సేకరించినందువల్ల నిందితులు దోషులుగా తేలుతారని భావించారు. కాని జాతీయ దర్యాప్తు సంస్థ అసీమానంద్ లాంటి వారు ముందు ఇచ్చిన వాంగ్మూలాలను మార్చుకోవడానికి అనుమతించింది. ఆ రకంగా ఊహించినట్టుగానే హిందుత్వ తీవ్రవాదుల మీద మోపిన ఆరోపణలు కూడా జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టు విచారణలో నిలబడలేదు.

అలాగే గుజరాత్ లో మాజీ మంత్రి మాయా కొద్నాని, మరో 17 మందిని 2002 నాటి నరోదా పాటియా మారణ కాండలో గుజరాత్ హైకోర్టు నిర్దోషులుగా తేల్చింది. కొద్నానీని 2009లో అరెస్టు చేశారు. 97 మంది ముస్లింలను హతమార్చడానికి ఆమె ప్రేరేపించారని నిర్ధారించి ఆమెకు 28 ఏళ్ల శిక్ష విధించారు. గుజరాత్ మారణ కాండలో ఒకే చోట 97 మంది ముస్లింలు మరణించడమే అతి పెద్ద సంఘటన. 2012లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ మారణకాండకు మాయా కొద్నానీనే ప్రధాన ప్రేరకురాలు అని తేల్చింది. మూకలు ముస్లింల మీద దాడులు చేసి, లూటీ చేసి హతమారుస్తున్నప్పుడు ఆమె అక్కడే ఉన్నట్టు సిట్ తేల్చింది. ఆమె 2007లో మంత్రి అయ్యారు. 2018 ఏప్రిల్ 20న గుజరాత్ హైకోర్టు ఆమె నిర్దోషి అని తీర్పు చెప్పింది. మారణకాండ జరిగినప్పుడు ఆమె అక్కడే ఉన్నట్టు కచ్చితమైన రుజువులు లేవన్న కారణంతో కోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది. దీన్ని బట్టి ప్రస్తుత ప్రభుత్వం తన నేరమయ లక్ష్యాలను సాధించడం కోసం న్యాయ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తోందో రుజువు అవుతోంది.

మరో వంక తులసీ ప్రజాపతి, సోహ్రాబుద్దీన్ ఎదురుకాల్పుల కేసులో ఇద్దరు సాక్ష్యులు మాట మార్చారు. 2005 నవంబర్ లో సోహ్రాబుద్దీన్, ఆయన భార్య కౌసర్ బీ, వారి సహచరుడు తులసీ ప్రజాపతి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీ వెళ్తుండగా గుజరాత్ పోలీసులు వారిని అపహరించారు. 2005 నవంబర్ లో బూటకపు ఎదురుకాల్పుల్లో సోహ్రాబుద్దీన్ ను గుజరాత్ పోలీసులు హతమార్చారు. ఆయన భార్య కౌసర్ బీ మీద అత్యాచారం చేసి అంతమొందించారు. ఓ సంత్సరం తర్వాత తులసీ ప్రజాపతికి కూడా అదే గతి పట్టింది. అంటే ఈ కేసులో సాక్ష్యులు సీబీఐ ఎదుట ఇచ్చిన వాంగ్మూలాలను మార్చుకుని ఉంటారు. దీని వల్ల 52 మంది సాక్ష్యులు ఎదురు తిరిగారు. న్యాయస్థానం ఇంతవరకు 76 మంది సాక్ష్యులను విచారించింది.

ఈ వ్యవహారాలన్నింటిలో కనిపించే ఒకే అంశం ఏమిటి?  

మొదటిది న్యాయవ్యవస్థ న్యాయం అందజేయడంలో విఫలమైంది. ఈ మూడు కేసుల్లోనూ పరిణామాలు గమనిస్తే బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం జరగలేదు. నేరానికి పాల్పడ్డ వారిని తప్పించిన తీరు చూసి వారంతా లోనయ్యారు.

రెండవది బలవంతులైన నేరగాళ్ల ముందు నేరాలను విచారించే వ్యవస్థలు నిస్సహాయంగా మిగిలిపోతున్నాయి. స్థానిక పోలీసులు, సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించడం, వాటిని కాపాడడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. ఒక వేళ ఆ పని చేసి ఉంటే సత్వరం నేర నిర్ధారణ సాధ్యమై ఉండేది. ప్రయోజనాత్మకమైన ఏ న్యాయవ్యవస్థలోనైనా జరగాలిసింది ఇదే. సాక్ష్యులు మాట మార్చడం, న్యాయమూర్తులను, ప్రాసిక్యూషన్ అధికారులను ఇష్టానుసారం బదిలీ చేయడం మొదలైనవన్నీ తీవ్ర ఆందోళనకరమైన పరిణామాలే. ఇలాంటి వాటివల్ల ప్రజలకు న్యాయవ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. మన గణతంత్రంపై దీర్ఘ కాలంలో విపరిణామాలు ఉంటాయి.

మూడవది అభినవ్ భారత్, విశ్వహిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, అధికారంలో ఉన్న బీజేపీతో సహా ఆర్.ఎస్. ఛత్రఛాయల్లో ఉండే హిందూ సంస్థలు, వాటితో సంబంధం ఉన్న వారి మీద అనేక ఆరోపణలు రావడం, అందులో అసీమానంద్, బాబూ బజరంగీ, మాయా కొద్నాని, గుజరాత్ మాజీ హోం మంత్రి అమిత్ షా లాంటి ప్రముఖులు ఉండడం, వారు ఎంతో కొంత కాలం జైలులో ఉండడం చివరకు నిర్దోషులుగా తేలడం కూడా మరింత ఆందోళన కలిగించే అంశాలే.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top