ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

తనను బోనెక్కిస్తారని భయపడుతున్న ట్రంప్

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ను బర్తరఫ్ చేశారు. ఈ విషయం ట్రంప్ మార్చి 13న ట్వీట్ చేశారు. ఈ పనితో ట్రంప్ టిల్లర్సన్ ను అవమానపరచడమె కాక విదేశాంగ మంత్రిత్వ శాఖ పట్ల తన చులకన భావాన్ని కుడా ప్రదర్శించారు. ఆ తర్వాత ట్రంప్ అనేక సార్లు కోరిన తర్వాత ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ డిప్యూటీ దైరెక్టర్ ఆండ్రూ మెక్ కాబేను ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది.

ట్రంప్ పనుపున అటార్నీ జనరల్ జెఫ్ పెషన్స్ ఆదేశం మేరకు మెక్ కాబే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. విచిత్రమేమిటంటే మెక్ కాబే చర్యలను అమెరికా అధ్యక్ష భవనం వర్గాలు తరచుగా ఖండించిన తర్వాత ఆయన తన పదవి నుంచి అదివరకే వైదొలగారు. అయితే తనకున్న సెలవులన్నీ వాడుకుని యాభై ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయడానికి వీలుగా ఆయన వేచి చూస్తున్నారు. పదవినుంచి వైదొలగిన అధికారిని మళ్లీ బర్తరఫ్ చేయడం కేవలం అధ్యక్షునికి విధేయుడుగా లేని కారణంగా కక్ష సాధించడమే.

 
 

 

2016 అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం గురించి ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ మ్యుల్లర్ దర్యాప్తు జరపడం కూడా ట్రంప్ కు మింగుడు పడినట్టు లేదు. రష్యా పెట్టుబడిదార్లతో ఆర్థిక సంబధాలున్న ట్రంప్ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన అన్ని రికార్డులను శోధించాల్సిందిగా మ్యుల్లర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దర్యాప్తుకు సంబంధించి మ్యుల్లర్ వైట్ హౌస్ కు ఓ ప్రశ్నావళిని కూడా పంపినట్టు తెలిసింది. అంతే కాక అధ్యక్షుడు ట్రంప్ ను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది.

ట్రంప్ వైట్ హౌస్ వ్యవహారాలను గురించి పత్రికా రచయిత మైఖేల్ ఉల్ఫ్ రాసిన “ఫైర్ అండ్ ఫూరీ: ఇన్సైడ్ ట్రంప్స్ వైట్ హౌస్” అనే పుస్తకం గత జనవరిలో విడుదలైంది. అందులో చాలా ఆసక్తికరమైన అంశాలున్నాయి. వైట్ హౌస్ లో కొన్ని నెలలు గడవక ముందే ట్రంప్ సన్నిహిత అనుయాయులు చాలా మంది ట్రంప్ అసమర్థుడని, ఏమీ తెలియదని, అధ్యక్ష పదవిని చేపట్టే యోగ్యత లేదనే అభిప్రాయానికి వచ్చారట. అంతేగాక ట్రంప్ కు తనమీద తనకే విపరీతమైన ప్రేమ అని, చంచలస్వభావుడని తేల్చారట. ట్రంప్ కు ఈ సంగతి తెలిసినట్టే ఉంది. అందుకే అధ్యక్షుడికి ఆంతరంగికులుగా ఉన్న చాలామందికి గడిచిన ఏడాది కాలంలో ఉద్వాసన చెప్పారు.

అయితే జనం మాత్రం నయా ఫాసిస్టు రాజకీయాల కోసమే అమెరికా అధ్యక్ష పీఠంపై ఉన్న ట్రంప్ సంకుచిత జాతీయతావాదానికి పరాకాష్ఠ. జాత్యహంకారి, స్త్రీ వ్యతిరేకి, సంపన్నుల కొమ్ము కాసే పెట్టుబడిదారు అని భావిస్తున్నారు. గడచిన నాలుగు దశాబ్దాలలో అమెరికన్ల ఆదాయంలో అంతరాలు పెరగడం వల్ల ఇటువంటిదేదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నారు.

దేశంలో ఒక శాతం జనాభా తమ ప్రయోజనాలకోసం తామే రూపొందించుకున్న ఆర్థిక వ్యవస్థ ఏర్పడడం ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల సృష్టికి దారి తీసింది. దానివల్లే ట్రంప్ శ్వేత సౌధంలో ప్రవేశించగలిగారు. అమెరికాను మళ్లీ ప్రపచంలోనే అగ్రరాజ్యంగా చేయడానికి దేశాధ్యక్షుడిగా ఉన్న తనకు చట్టపరమైన అడ్డంకులేవీ ఉండకూడదని ఆయన నమ్ముతున్నాడు.

తన వ్యాపార సంస్థల అధినేతగా సర్వాధికారాలు ఉన్నట్టే అమెరికా అధ్యక్షుడిగా అధికారం మొత్తం తన చేతిలో కేంద్రీకృతం కావాలని ట్రంప్ కోరిక. ఆయన అహంభావానికి అవధుల్లేవు. అందుకే గత సంవత్సరం ఆగస్టులో జరిగిన చార్లోట్ విల్ ప్రదర్శనలు జరిగినప్పుడు న్యాయపాలనకు తానే తుది న్యాయనిర్ణేతనన్నట్టు వ్యవహరించాడు. నయా నాజీలను “చాలా మంచి వారు” అని ప్రస్తుతించాడు. ఆయన మనసులో ఏముందో గాని ఉత్తర కొరియా అధినేత కిం జోంగ్ ఉన్ తో శిఖరాగ్ర భేటీకి అంగీకరించాడు. ఈ విషయాన్ని ముందుగా తన రక్షణ మంత్రికి, అప్పటి విదేశాంగ మంత్రికి మాటమాత్రంగా కూడా చెప్పలేదు. కిం తో సమావేశం అయినట్టే అయి దాన్ని చెడగొట్టి చర్చలు ఫలప్రదం కాలేదు కాబట్టి ఆ సాకుతో కయ్యానికి దిగడం ట్రంప్ ఉద్దేశం కావచ్చు.

ఇప్పుడు ఆయన తనకు విధేయుడైన గూఢచార విభాగానికి చెందిన ఉన్నతాధికారి ప్రభుత్వ విదేశాంగ వ్యవహారాలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక సి.ఐ.ఏ. తరఫున జైలులో ఖైదీలను చిత్రహింసలు పెట్టడంలో ఆరితేరిన గినా హోస్పెల్ పాంపియో  సి.ఐ.ఏ. డైరెక్టర్ అవుతారు.

సోవియట్ శకం తర్వాత అమెరికా తనకు మిత్ర దేశాలైన నాటో కూటమితో కలిసి బాల్కన్స్, మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలతో యుద్ధం చేసింది. ఉక్రేన్ లో కుట్రకు దళారిగా నిలిచింది. ఇప్పుడు పెట్టుబడిదారీ దేశంగా మారిన రష్యా స్పందిస్తూ ఉక్రేన్ లో భాగమైన క్రిమియాను తనలో కలిపేసుకుంది. అంతే కాక సిరియాలో జోక్యం చేసుకుని అస్సాద్ ప్రభుత్వాన్ని కూలదోయకుండా అడ్డుకుంది. మొత్తం మీద అమెరికా సైనిక, గూఢచార వ్యవస్థ రష్యాను ప్రధాన శత్రువుగా పరిగణిస్తుంది. అమెరికా పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఇస్లామిక్ రాజ్యాలను, ఇరాన్, ఉత్తర కొరియా, చైనా దేశాలను తమ శత్రువులుగా పరిగణిస్తుంది.

గత ఏడాదిన్నరగా టంప్ ప్రభుత్వం అమెరికా సైనిక గూఢచార వ్యవస్థను తమ దారికి తెచ్చుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నప్పటికీ ఫలితం లేదు. నిజానికి అమెరికా సైనిక గూఢచార వ్యవస్థ డెమొక్రాట్ల అండతో ట్రంప్ ను గద్దె దించాలని చూస్తోంది. అందుకే ప్రభుత్వ రహస్యాలను అనేకం బయటపెడుతోంది. అభిశంసన లేదా తీవ్ర నేరారోపణకు అవకాశం ఉందని ట్రంప్ భయపడుతున్నాడు. అందుకే నిరంతరం తనకు అండగా ఉండే విధేయులను చుట్టూ ఉంచుకుంటున్నారు.

అయితే ట్రంప్ ప్రభుత్వం గాని, డెమొక్రాట్ల కనుసన్నల్లో మెలగుతున్న సైనిక గూఢచార వ్యవస్థ గాని అమెరికాలో, ప్రపంచ దేశాలలో ప్రజాస్వామ్య మనుగడకు తోడ్పడవు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కులకు రెండు పక్షాలూ ప్రమాదకరమే.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top