చైనాతో వెర్రి వైరం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
డోక్లాం లేదా డోంగ్లాంగ్ పీఠభూమిలో చైనా వేపు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి భారత సైనిక దళాలు సిక్కిం దగ్గర భారత చైన సరిహద్దు దగ్గరకు వెళ్లిన జూన్ 26వ తేదీన భారత్-అమెరికా మధ్య ఉన్న విభేదాలు కనిపించకుండా చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్ లో చాలా నిరాశాపూరితంగా ప్రయత్నాలు చేస్తున్నారు. "అమెరికాకే ప్రాధాన్యం" అన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో విభేదాలు ఎలా కప్పిపుచ్చాలా అన్నది మోదీ ప్రయత్నం. అయితే ఈ అంశం భారత-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతీస్తుందా అన్న విషయం పత్రికల వారికి కూడా ఆందోళన కలిగించింది. భారత్ "గొప్ప శక్తి"గా ఎదగాలంటే భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడాలన్నది భారత పాలక వర్గాల ఉద్దేశం. చైనాతో వైరం కొని తెచ్చుకోవడం హిందుత్వ వాది, భారత ప్రధానమంత్రికి కుడి భుజం లాంటి వ్యక్తి ఆలోచన. గతంలోనే ఈశాన్యంలో మక్ మోహల్ లైన్ దగ్గర, వాయవ్యంలో ఆక్సాయి చీన్ దగ్గర మనకు చైనాతో సరిహద్దు తగవులు ఉన్నాయి. ఇప్పుడు సిక్కిం దగ్గర మూడో వివాదం రేకిత్తించి చైనాకు వ్యతిరేకంగా అమెరికా సామ్రాజ్యవాదంతో కత్తు కలపాలన్నది ఈ వైరం కొని తెచ్చుకోవడంలో భాగం. కాని ఈ వక్ర నీతి పని చేస్తుందా?
2014 నుంచి అంటే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి బరాక్ ఒబామా ప్రభుత్వం చైనాను నిలవరించడానికి భారతీయ జనతా పార్టీ సైంద్ధాంతిక ప్రవృత్తిని బాగా వినియోగించుకుని భారత్ ను చైనాను కట్టడి చేయడానికి వినియోగించుకుంది. భారత్ ను "పెద్ద రక్షణ భాగస్వామిగా" అమెరికా ప్రకటించింది. దీని ప్రకారం అమెరికాకు అతి సన్నిహితంగా ఉండే దేశాలతో పాటు రక్షణ సాంకేతికతను ఇచ్చి పుచ్చుకోవడానికి భారత్ కు అవకాశం దక్కుతుంది. అమెరికా భారత సైనిక స్థావరాలలో తన బలగాలను నియోగించడానికి వీలవుతుంది. తద్వారా చైనాకు వ్యతిరేకంగా తమ వ్యూహంలో భారత్ ను అమెరికా వినియోగించుకుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై ఇంకా పదవీ స్వీకారం చేయకముందు డోనాల్డ్ ట్రంప్ 2016 డిసెంబర్ లో తాను "ఒకే చైనా" విధానానికి కట్టుబడి ఉండబోనని ప్రకటించారు. "ఒకే చైనా" విధానం చైనా అంతటికీ బీజింగ్ లో ఉన్న ప్రభుత్వాన్ని గుర్తించడమే. గత 45 ఏళ్లుగా అమెరికా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. చైనాకు, అమెరికాకు మధ్య ఉన్న అనేక వివాదాస్పదమైన అంశాల విషయంలో చైనా ప్రభుత్వం లొంగితే తప్ప తాను ఈ విధానాన్ని అంగీకరించబోనని ట్రంప్ స్పష్టం చేశారు. దీన్ని బట్టి భూబాగాలకు సంబంధించి భారత్ చేసే అన్ని వాదనలను అమెరికా సమర్థిస్తుందని మోదీ సలహాదారులు భావించారు.
రెండు సరిహద్దు వివాదాల గురించి "సంభాషణలకు" భారత్ సిద్ధంగా ఉంది కాని ఆక్సాయి చీన్ విషయంలో "సంప్రదింపులు" జరిపితే తమ వాదన నుంచి దిగివచ్చినట్టు అవుతుందని భారత ప్రభుత్వం వాదిస్తోంది. పైగా మెక్ మోహన్ లైన్ కు చట్టబద్ధత ఉన్నట్టు వ్యవహరిస్తోంది. భారత సంరక్షణలో ఉన్న భూటాన్ మినహా చైనా పొరుగున ఉన్న దేశాలన్నీ చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. చారిత్రకంగా తమకు దక్కిన సరిహద్దులను తమ సరిహద్దులుగా అంగీకరించడానికి చైనా దాదాపుగా సిద్ధంగా ఉంది. అందువల్ల సంప్రదింపుల ద్వారా కుదిరే ఏ ఒప్పందం ప్రకారం అయినా మెక్ మోహన్ లైన్ దాకా భారత భూభాగం ఉంటుంది. కాని బ్రిటన్ విస్తరణ వాద దశలో తమ భూభాగం కొంత నష్టపోయామని తెలిసినా చైనా ఇందుకు సిద్ధంగా ఉంది.
అలాంటప్పుడు చైనాతో శతృత్వం కొని తెచ్చుకోవడానికి భారత్ ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? రెండున్నర రంగాలలో అంటే చైనాతో, పాకిస్తాన్ తో, భారత్ లో తిరుగుబాటుదార్లతో ఏక కాలంలో యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని సైనిక దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ బాధ్యతారహితమైన ప్రకటన చేశారు. విదేశాంగ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం, పెద్ద మీడియా సంస్థలు, భద్రతా వ్యవహారాలలో నిపుణులం అనుకునే వారు చైనా-భారత్-భూటాన్ సరిహద్దును చైనా మరింత దక్షిణానికి నెట్టాలనుకుంటోందని, అలాగైతే యుద్ధం వస్తే సిలిగురి ప్రాంతాన్ని "కబళించ" వచ్చుననుకుంటోందని, అప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి మిగతా భారత్ లోని ఈ శాన్య రాష్ట్రాలకు చొరబడి ఆ రాష్ట్రాలతో ఉండే ఒకే ఒక మార్గానికి ఆటంకం కలగ చేయాలని చైనా భావిస్తోందని వాదిస్తున్నారు. అది పొంతనలేని వాదన. గత మూడేళ్ల నుంచి భారత్ అనుసరిస్తున్న విధానం అమెరికాతో సంబంధాలలో "ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో" భారత్ "వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి" పాటిస్తుందని చెప్పడానికి విరుద్ధం.
కాని మోదీ సలహాదార్లకు విస్మయం కలిగించేట్టు ట్రంప్ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చైనాకు ఉన్న అదనపు వాణిజ్య మిగులును తగ్గించాలని కోరుతున్నారు. ఉత్తర కొరియా అణ్వస్త్రాలు, క్షిపణుల విషయంలో ప్యోంగ్యాంగ్ ప్రభుత్వానికి చైనా నచ్చ చెప్పాలంటున్నారు. చైనాతో మూడో చోట భారత్ వివాదం లేవదీసినప్పుడు అమెరికా ప్రభుత్వం గాని, జపాన్ ప్రభుత్వం గాని భారత్ వాదనను సమర్థించలేదు. అమెరికా నుంచి మద్దతు సమకూరని పరిస్థితిలో చైనా అధీనంలో ఉన్న డోక్లాం నుంచి మోదీ గుట్టు చప్పుడు కాకుండా భారత సైన్యాలను ఉపసంహరిస్తారా?