ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

పేదల్లోనూ పెరుగుతున్న మధుమేహం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ఇంతవరకు సంపన్నులకు మాత్రమే సోకుతుందనుకునే రుగ్మత ఇప్పుడు మన దేశంలో పేదలనూ పీడిస్తోంది. భారత వైద్య పరిశోధనా మండలి అధ్యయనంలో తేలిన ఈ అంశం ఆందోళన కల్గిస్తోంది. కొద్ది సంవత్సరాల కిందటి వరకు మధుమేహం లేదా చెక్కర వ్యాధి జీవన శైలి కారణంగా వచ్చే జబ్బు అనుకునే వాళ్లం. కలిగిన వారికి మాత్రమే వస్తుందని భావించేవాళ్లం. అధిక కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు తినే వారికి, బరువు ఎక్కువగా ఉండే వారికి, శారీరక శ్రమ చేయని వారికి మాత్రమే మధుమేహ వ్యాధి సోకుతుందని నమ్మే వాళ్లం. కాని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, అభివృద్ధి చెందుతున్న దేశాలలోనూ పేదలను కూడా ఈ జబ్బు వదలడం లేదు. ప్రపంచంలోకెల్లా మధుమేహ రోగులు ఎక్కువగా ఉన్న భారత్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో సామాజిక, ఆర్థిక కొలమానాలను బట్టి దిగువ స్థాయిలో ఉన్న వారికి కూడా మధుమేహం బాధ తప్పడం లేదని భారత వైద్య పరిశోధనా మండలి, ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ చేసిన అధ్యయనంలో తేలింది. సంపన్నుల కన్నా ఈ వర్గాలలోనే మధుమేహం ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. ఇంతకు ముందు ఈ వ్యాధి రాదని, తక్కువగా వస్తుందని అనుకునే వర్గాలకు కూడా ఇది సోకుతోంది. పట్టణ ప్రాంతాలలోని పేదలకు, గ్రామీణ ప్రాంతాలలోని కలిగిన వారిని ఈ వ్యాధి పీడిస్తోంది.

ఇది కేవలం ఆందోళన కలిగించే అంశమే కాదు భయపడాల్సింది కూడా. మధుమేహానికి తగిన చికిత్స లేక పోతే  గుండె, మూత్రపిండాలు, కళ్లు కూడా దెబ్బతింటాయి. దేశంలో ఆరోగ్య సదుపాయాలు అర కొరగా ఉండడం, పేదలు ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ ఖర్చు భరించవలసి రావడం వల్ల ఈ పరిస్థితిని నివారించడం కోసం సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 15 రాష్ట్రాలలో 7.3 శాతం మంది మధుమేహ వ్యాధితో బాధ పడుతున్నారు. బిహార్ లో 4.3 శాటం మందికి ఈ వ్యాధి ఉంటే పంజాబ్ లో 10 శాతం మందికి ఉంది. మన దేశంలో 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాలలోనే ఉంటారు కనక కొద్ది శాతం మందికి ఈ వ్యాధి సోకినా వారి సంఖ్య అపారంగా పెరిగిపోతుంది. వీరికి నిరంతర వైద్య సహాయం కావాల్సి వస్తుంది.

పేద రాష్ట్రాలలో కన్న అభివృద్ధి చెందిన ఏడు రాష్ట్రాలైన పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడులో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాలలో ఉండే వారికి ఈ వ్యాధి గురించి అవహాగన ఉంటుంది కనక వారు చికిత్స చేయించుకోగలుగుతారు.

కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు చౌకగా, సులభంగా దొరికే అవకాశం ఉన్నందువల్ల సామాజికంగా, ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్న వారికి కూడా ఈ జబ్బు సోకుతూ ఉండవచ్చునని, అయితే ఇతర కారణాలు కూడా ఉంటాయని పోషకార నిపుణులు అంటున్నారు. పట్టణ ప్రాంతాలలో ఉండే పేదలకు పోషక పదార్థాలు ఉన్న సమతులాహారం దొరకక పోవచ్చు. అందువల్ల సులభంగా ఉండే చెత్త తిళ్లు తింటారు. రుచి కోసమో, ఇష్టమయ్యో ఈ ఆహారం తినకపోవచ్చు. కాని అందుబాటులో ఉన్నందువల్ల తింటారు. దీనికి తోడు శారీరక శ్రమ ఎక్కువగా అవసరం లేని వారు, రవాణా సదుపాయాలు ఎక్కువగా అందుబాటులో ఉన్న వారు పట్టణ ప్రాంతాలలో మధుమేహ వ్యాధి బారిన పడుతూ ఉంటారు. పని కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం, ప్రభుత్వ రవాణా సదుపాయాలను వినియోగించాల్సి రావడం కూడా ఇష్టమై కాకపోవచ్చు. వీటి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మధుమేహం రావడానికి ఒత్తిడి పెరగడం కూడా ఒక కారణమే.

దక్షిణాసియా దేశలలో పిల్లలకు కూడా మధుమేహం సోకుతూ ఉంటుంది. ఆసియా ప్రాంతంలోని వారికి ఇతర ప్రాంతాల వారికన్నా మదుమేహం త్వరగా వస్తుంది. ఇతర దేశాల్లాగే భారత్ లో కూడా మధుమేహం త్వరిత గతిన పెరుగుతోంది. శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటోంది. అన్ని వర్గాల మహిళల్లోనూ ఇదే పరిస్థితి ఉంటోంది.

ఇంతకు ముందు జరిగిన అధ్యయన ఫలితాలను కూడా ఈ అధ్యయనంలో చేర్చారు. 2010 నుంచి కాన్సర్, మధుమేహం, గుండెకు సంబంధించిన జాగ్రత్తలు క్రియాశీలంగానే ఉన్నాయి. కాని మధుమేహ వ్యాప్తి నిరోధానికి స్వల్పకాలిక, దీర్ఘ కాలిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందదని భారత వైద్య పరిశోధనా మండలి సర్వేలో తేలింది. ఈ వ్యాధి నిరోధానికి ప్రజల పాత్రను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వైద్య రంగంలో ఉన్న వారు కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుంది. పోషకారం అందడంతో పాటు శారీరక శ్రమ, మధుమేహ వ్యాధి గురించి నిరంతరంగా తెలియజేయడం కూడా అవసరమే. ఇది జరగాలంటే దీర్ఘ కాలిక ప్రణాళికల అవసరం ఎక్కువ.

వర్ధమాన దేశాలలో అంటువ్యాధుల సమస్య ఎక్కువ. అయితే చడీ చప్పుడు లేకుండా ప్రాణాలు తీసే మధుమేహం వంటి వ్యాధులు భయంకరంగా వ్యాపిస్తున్నాయి. 1921 లో ఇన్సులిన్ కనిపెట్టక ముందు మధుమేహం సోకడం అంటే మరణం ఖాయంగా ఉండేది. ఆ తర్వాత మధుమేహం సోకిన వారు జీవించగలిగే అవకాశాలు 50 శాతం దాకా ఉండేవి. 21వ శతాబ్దంలో అధిక సంఖ్యాకులు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే, అర్థాంతరంగా జీవితం ముగియకుండా ఉండాలంటే మదుమేహ వ్యాధిని అరికట్టే చర్యలు తీసుకోవాల్సిందే.

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top