ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

విశ్వవిద్యాలయాల పరిశోధనకు కత్తెర

ప్రభుత్వ నిర్వహణలోని విశ్వవిద్యాలయాలకు, ముఖ్యంగా సామాజిక శాస్త్రాల అధ్యయనానికి ఇటీవల విశ్వ విద్యాలయాల నిధుల సంఘం (యు.జి.సి.) నిధుల కేటాయింపుల్లో కోత విధించింది. పదకొండవ పంచవర్ష ప్రణాలికలో (2007-12) భాగంగా యు.జి.సి. ప్రారంభించిన అనేక సామాజిక శాస్త్ర బోధ్న, పరిశోధనా కేంద్రాలు పంచవర్ష ప్రణాళికలను రద్దు చేసిన తర్వాత నిధులు లేక సతమతమవుతున్నాయి. నిధుల కేటాయింపులో యు.జి.సి. సందిగ్ధ వైఖరి వల్ల అనేక మంది అధ్యాపకుల, పరిశోధకుల, విద్యార్థుల కొత్త కోర్సుల, చర్చల భవిష్యత్తు గందరగోళ స్థితిలో పడిపోయింది.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ప్రభుత్వ నిర్వహణలోని విశ్వవిద్యాలయాలకు, ముఖ్యంగా సామాజిక శాస్త్రాల అధ్యయనానికి ఇటీవల విశ్వ విద్యాలయాల నిధుల సంఘం (యు.జి.సి.) నిధుల కేటాయింపుల్లో కోత విధించింది. పదకొండవ పంచవర్ష ప్రణాలికలో (2007-12) భాగంగా యు.జి.సి. ప్రారంభించిన అనేక సామాజిక శాస్త్ర బోధ్న, పరిశోధనా కేంద్రాలు పంచవర్ష ప్రణాళికలను రద్దు చేసిన తర్వాత నిధులు లేక సతమతమవుతున్నాయి. నిధుల కేటాయింపులో యు.జి.సి. సందిగ్ధ వైఖరి వల్ల అనేక మంది అధ్యాపకుల, పరిశోధకుల, విద్యార్థుల కొత్త కోర్సుల, చర్చల భవిష్యత్తు గందరగోళ స్థితిలో పడిపోయింది.

దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న సామాజిక శాస్త్ర కేంద్రాలు ప్రణాళిక నిధుల మీద ఆధారపడి ఉన్నాయి. నిదుల కొరత వల్ల కొన్ని విశ్వవిద్యాలయాలలో వీటిని ఆయా శాస్త్ర విభాగాలుగా మార్చేశారు. మరి కొన్న చోట్ల వాటికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇతర మార్గాల ద్వారా నిధులు సేకరిస్తున్నాయి. కాని పూర్తిగా ప్రణాళికా నిధుల మీద ఆధారపడ్డ కేంద్రాలను మూసి వేయాల్సిన పరిస్థితో, వాటి సామర్థ్యాన్ని కుదించవలసిన అగత్యమో ఏర్పడుతోంది. 

నిధుల కేటాయింపులో కోత పెట్టినందువల్ల గత నెలలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మహిళలకు సంబంధించిన అధునాతన పరిశోధనా కేంద్రం (అడ్వాన్స్డ్ సెంటర్ ఆఫ్ విమెన్ స్టడీస్), సామాజిక సంఘటన, మినహాయింపు విధానాలు (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్ క్లూజన్ అండ ఇంక్లూజివ్ పాలసీస్), మానవ హక్కుల విద్యలో ప్రావీణ్యతా కేంద్రం (నోడల్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ హూమన్ రైట్స్) వంటి విభాలలో అనేక మంది అధ్యాపకులను, విద్యార్థులను సాగనంపింది. అయితే ఈ వ్యవహారంపై మీడియా దృష్టి పడడం, విమర్శలు తలెత్తడం వల్ల యు.జి.సి. ఈ విభాగాలకు ఒక ఏడాది అంటే 2018 మార్చి 31 దాకా గడువిచ్చింది. అప్పటి వరకు ప్రణాళిక నిధులు అందజేయడానికి అంగీకరించినందువల్ల టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చాలా మంది అధ్యాపకులను కొనసాగిస్తోంది. ఈ అరకొర చర్యల వల్ల నిరసనలు ప్రస్తుతానికి ఆగిపోయి ఉండొచ్చు. కాని దీర్ఘకాలికంగా ఈ విభాగాల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. దానికి పరిష్కారం లేదు.

మహిళలకు సంబ్మధించి కొన్ని విశ్వవిద్యాలయాలలో ఈ కేంద్రాలు 1970లలోనే ఏర్పడినా 1980ల నుంచే వాటికి యు.జి.సి. నిధులు అందుతున్నాయి. పదకొండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఇలాంటి అంశాల బోధన, పరిశోధన పూర్తి స్థాయిలో జరగాలని భావించి వాటి కార్యకలాపాలను విస్తరించారు. మహిళలకు సంబంధించిన అధ్యయనం, సామాజిక మినహాయింపు, మానవ హక్కుల అధ్యయనం వంటి వాటిని ఈ విస్తరణలో భాగం చేశారు. ఉదాహరణకు మహిళలకు సంబ్మధించిన అధ్యన కేంద్రాలకు "వివిధ శాస్త్రాల మధ్య అధ్యయనానికి అనుకూలమైన విధాన రూపకల్పన", "ఇత్రర శాస్త్ర విభాగాలను పెంపొందించడం", "విధాన నిర్ణయాలకు సూచనలు చేయడం" వంటి బాధ్యత అప్పగించారు. అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు, దళితులు, గిరిజనులు, శ్రామికులు, మతపరమైన వర్గాలకు పరిశోధనలో అవకాశం కల్పించే బాధ్యత సైతం అప్పగించారు. ఈ కేంద్రాలు నూతన, కీలక పరిశోధనా ప్రణాళికలు రూపొందించాయి. వీటిలో విభిన్న శాస్త్రాలను కలగలపి కులం, వర్గం, లింగ పరమైన అంశాలను బోధించడానికి కొత్త అధ్యాపకులను నియమించారు. విద్యార్థులను చేర్చుకున్నారు.

సామాజిక శాస్త్రాలు ఏ మేరకు సమానత్వం చూపుతున్నాయి అని సామాజిక శాస్త్రవేత్త గోపాల్ గురు ప్రశ్నించారు. విద్యా సంస్థలలో, వ్యవస్థలలో సాంస్కృతిక పరమైన సామాజిక దొంతర విధానాన్ని ఆయన విమర్శించారు. సామాజిక శాస్త్రాల పరిశోధనలో వివిధ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలని వాదించారు. సరిగ్గా ఈ లక్ష్యంతోనే ఈ ప్రత్యేక కేంద్రాలు ఏర్పడ్డాయి. పని చేస్తున్నాయి. ఈ కేంద్రాలు సాంప్రదాయికమైన సామాజిక శాస్త్రాలను ప్రశ్నించాయి. జ్ఞాన మీమాంసకు సంబంధించిన సవాళ్లు లేవనెత్తాయి. ఆచరణ-సిద్ధాంతం, వ్యవస్థ-కారకత్వం, వామపక్షం-మితవాద పక్షం అన్న ద్వంద్వాలను సవాలు చేశాయి. పునఃపరిశీలించాని కోరాయి. పుణె లోని క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే కేంద్రం లాంటివి నూతన బోధనా పద్ధతులను ప్రవేశపెట్టాయి. ఇంతవరకు అణగారిన వర్గాల మీద పరిశోధనకు పరిమితమైతే ఇప్పుడు ఆ వర్గాలకే పరిశోధన చేసే అవకాశం కల్పించాయి.

కేంద్ర విద్యా సంస్థలలో 2006నాటి కేంద్మ్ర విద్యా సంస్థలలో (ప్రవేశాలలో రిజర్వేషన్ల) చట్టం ఆధారంగా 2007లో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించడంతో పాటే ఈ అధ్యయన కేంద్రాలు కూడా ఏర్పడి విద్యార్థులను చేర్చుకోవడం పెరిగింది. దీని వల్ల ఉన్నత విద్యలో వివిధ వర్గాల వారు ప్రవేశించారు. ఈ కొత్త కేంద్రాలు కులం, పిర్తృస్వామ్యం, ప్రధాన స్రవంతిలో జరుగుత్న్న చర్చలను, రాజ్య వ్యవస్థ అణచివేతను ప్రశ్నించడానికి సైద్ధాంతిక ప్రోత్సహానికి వీలు కల్పించాయి. రోహిత్ వేములకు న్యాయం (అణగారిన వర్గాలకు చెందిన వారిపై వ్యవస్థాగతమైన అణచివేతకు వ్యతిరేకంగా), పింజ్రా తోడ్ (హాస్టళ్లలో, విశ్వవిద్యాలయాలలో అమ్మాయిలపై నిఘాకు, లింగా వివక్షకు వ్యతిరేకంగా) హొక్ కొలొరోబ్ (జాధవ్ పూర్ విశ్వవిద్యాలయంలో మహిళ మీత అఘాయిత్యానికి వ్యతిరేకంగా) వేదికలు విస్తరించడానికి కారణం అయింది. ఈ నేపథ్యంలోనే మద్రాస్ ఐ.ఐ.టి.లో అంబేద్కర్, పెరియార్ అధ్యయన కేంద్రానికి గుర్తింపు రద్దైంది. ఈ ఉద్యమాలు విద్యార్థులకు సంబంధించిన వాదాలలో, రాజకీయాలలో లింగ వివక్ష, కుల వివక్ష వంటి అంశాలను చర్చనీయాంశం చేశాయి. విద్యార్థి సంఘాల ఏర్పాటు తీరును, నాయకత్వాన్ని ప్రశ్నించాయి. మిగతా కేంద్ర, రాష్ట్ర విద్యార్థులతో సంఘీభావానికి అవకాశం కల్పించాయి.

సామాజిక సాస్త్ర కేంద్రాలకు ఒక ఏడాది పొడింపు ఇవ్వడం ఒక వైపు విద్యార్థులు-అధ్యాపకులు మరో వైపు యు.జి.సి.కి మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనలో తాత్కాలిక చర్య మాత్రమే. అసలు విషయం ప్రస్తుత వ్యవహార సరళిని మార్చడానికి కీలక పరిశోధనలకు అవకాశం లేకపోవడం, సమానత్వం, విస్తృత ప్రాతిపదికన ప్రాతినిధ్యానికి అవకాశం ఉండడమే. ప్రణాళికా విధానం ఆగిపోయినా ఈ పరిశోధనా క్రమానికి ప్రభుత్వ నిధులు అందాల్సిందే. ఇలాంటి ప్రత్యేక కేంద్రాల వల్ల విశ్వవిద్యాలయాలు మేధోపరంగా విస్తరిస్తాయి. ఎందుకంటే అట్టడుగు వర్గాల నుంచి జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అప్పుడు సాంప్రదాయికమైన విద్యార్జనా పద్ధతులను సవాలు చేయవచ్చు. విద్యార్థులు మరింత విమర్శనాత్మక పద్ధతిలో ఆలోచించగలుగుతారు. విశ్వవిద్యాలయాలు, ఆ మాటకొస్తే విద్యా రంగం చేయాల్సిన పని అదే. 

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top